ICC announces WTC Final 2023 Prize Money: ఐపీఎల్ 2023 తుది అంకానికి చేరింది. 16వ సీజన్ మే 28న ముగియనునుంది. ఐపీఎల్ ముగిసిన వెంటనే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ 2023 జరుగనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ 2023లో ఆస్ట్రేలియా, భారత్ తలపడనున్నాయి. ఇంగ్లండ్‌లోని ప్రఖ్యాత ఓవల్ మైదానంలో జూన్ 7 నుంచి 11 వరకు ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్ కోసం ఇప్పటికే టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సహా కొందరు ఆటగాళ్లు లండన్ చేరుకున్నారు. ఐపీఎల్ 2023 అనంతరం మిగతా భారత ప్లేయర్స్ కూడా లండన్ వెళ్లనున్నారు. ఈ ఫైనల్ ప్రైజ్‌మనీని ఐసీసీ తాజాగా ప్రకటించింది.
డబ్ల్యూటీసీ ఫైనల్ 2023లో విజేతగా నిలిచిన జట్టుకు 1.6 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.13.22 కోట్లు) బహుమతిగా అందుతుంది. ఇక రన్నరప్‌గా నిలిచిన జట్టుకు 8 లక్షల డాలర్లు ( భారత కరెన్సీలో రూ.6.5 కోట్లు) అందుతుందని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా, భారత్ జట్లు ఈ ప్రైజ్‌మనీని సొంతం చేసుకోనున్నాయి. 2023 డబ్ల్యూటీసీ సీజన్ సైతం 2021 లాగే 3.8 మిలియన్ డాలర్ల పర్స్ విలువను కలిగి ఉంది.
డబ్ల్యూటీసీ ఫైనల్ 2023లో మూడో స్థానంలో నిలిచిన దక్షిణాఫ్రికాకు 450,000 డాలర్లు అందనుండగా.. నాలుగో స్థానంలో నిలిచిన ఇంగ్లండ్‌కు 350,000 డాలర్లు అందుతాయి. ఐదో స్థానంలో ఉన్న శ్రీలంకకు 200,000 డాలర్లు అందనుండగా.. 6, 7, 8, 9 స్థానాల్లో ఉన్న న్యూజిలాండ్, పాకిస్థాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్ జట్లకు తలో 100,000 డాలర్ల ప్రైజ్‌మనీ అందుతుంది. డబ్ల్యూటీసీ 2021-23లో మొత్తం తొమ్మిది జట్లు పాల్గొన్న విషయం తెలిసిందే. జూన్ 7-11 మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ 2023 జరగనుంది. జూన్ 12వ తేదీని రిజర్వ్ డేగా ప్రకటించారు. వర్షం పడితే రిజర్వ్ డేను ఉపయోగించనున్నారు.
రవిశాస్త్రి జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, రవీంద్ర జడేజా, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.
Also Read: Nothing Phone 2 Launch: నథింగ్ నుంచి మరో సూపర్ స్మార్ట్‌ఫోన్.. ఆకర్షణీయమైన డిజైన్, బలమైన బ్యాటరీ!
Also Read: MS Dhoni vs Rohit Sharma: ఎంఎస్ ధోనీకి వచ్చిన పేరు రోహిత్ శర్మకు దక్కలేదు: గవాస్కర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.