ODI World Cup 2023: ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే టీమిండియాదే కప్..!

Team India; క్రికెట్‌లో ఆట‌గాళ్ల‌ ప్రతిభతో పాటు అప్పుడప్పుడు కొన్ని సెంటిమెంట్లు కూడా వర్కౌట్ అవుతుంటాయి.ఈ సారి ఆ సెంటిమెంట్ కలిసొస్తే టీమిండియాదే కప్ అంటున్నారు ఫ్యాన్స్. అదేంటంటే..  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 25, 2023, 09:51 PM IST
ODI World Cup 2023: ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే టీమిండియాదే కప్..!

ODI World Cup 2023: భారత్ వేదికగా అక్టోబరు 05 నుంచి వన్డే వరల్డ్ కప్ ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఈ మెగా సమరం కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ టోర్నీ కోసం జట్లన్నీ ఇప్పటికే తమ స్క్వాడ్స్ ను ప్రకటించాయి. అయితే ఇలాంటి సమయంలో ఓ సెంటిమెంట్ భారత అభిమానులను పుల్ ఖుషీ చేస్తోంది. 

అదేంటంటే..ప్రస్తుతం టీమిండియా ఐసీసీ ర్యాంకింగ్స్ లో నంబర్ వన్ ర్యాంక్ లో ఉంది. ఈ మెగా టోర్నీలో రోహిత్ సేన నంబర్ 1(World No 1)గా బరిలోకి దిగుతోంది. గత రెండు వరల్డ్ కప్ లు ఐసీసీ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో ఉన్న జట్లే కప్ గెలిచాయి. 2015లో ఆస్ట్రేలియా, 2019లో ఇంగ్లాండ్ నంబర్ వన్ హోదాలోనే బరిలోకి దిగి ట్రోఫీ గెలిచాయి. ఇప్పుడు ఇదే సెంటిమెంట్ టీమిండియాకు కలిసొచ్చే అవకాశం ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 

ఇదొక్కటే కాదు మరోక సెంటిమెంట్ కూడా ఉంది. 2011 ప్రపంచ కప్ నుంచి అతిథ్య జట్టే కప్పు నెగ్గుతూ వస్తోంది. 2011లో భారత్‌, 2015లో ఆస్ట్రేలియా, 2019లో ఇంగ్లండ్‌లు వరల్డ్ కప్ ను గెలిచాయి. ఇదే సెంటిమెంట్ మరోసారి టీమిండియాను విజేతగా నిలబెడుతుందని మాజీ క్రికెటర్లు, ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. 

Also Read: Kapil Dev Video: 1983 వ‌ర‌ల్డ్ క‌ప్ హీరో క‌పిల్ దేవ్ కిడ్నాప్, వీడియో వైరల్

ప్రపంచ కప్ లో పాల్గొనబోయే జట్లు- ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఇండియా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, శ్రీలంక, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, నెదర్లాండ్స్. 
వరల్డ్ కప్ కోసం భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్. షమీ, మొహమ్మద్. సిరాజ్, కుల్దీప్ యాదవ్.

Also Read: India Wins Gold: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఆసియా గేమ్స్‌లో మరో సర్ణం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News