West Indies Fail To Qualify For ODI World Cup 2023: రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్.. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన జట్టు ఇప్పుడు కనీసం వరల్డ్ కప్‌కు కూడా అర్హత సాధించలేకపోయింది. పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లు వెస్టిండీస్ పరిస్థితి మారిపోయింది. పేరుకు జట్టులో మంచి మంచి ఆటగాళ్లు ఉన్నా.. ఆటతీరుకు వచ్చేసరికి గల్లీ ప్లేయర్ల కంటే దారుణంగా ఆడుతున్నారు. ఫలితంగా ప్రపంచకప్ రేసు నుంచి కరేబియన్ జట్టు తప్పుకుంది. వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లలో వరుసగా మూడో ఓటమిని మూటగట్టుకుంది. ఇప్పటికే జింబాబ్వే, నెదర్లాండ్స్ చేతిలో ఓడిన విండీస్.. తాజాగా స్కాట్లాండ్ చేతిలోనూ ఓడిపోయి ఇంటి ముఖం పట్టింది. 1975 తరువాత వెస్టిండీస్ జట్టు లేకుండా తొలిసారి వరల్డ్ కప్ జరగనుంది.
ఈ మ్యాచ్‌లో స్కాట్లాండ్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ జట్టు.. 43.5 ఓవర్లలో 181 పరుగులకే కుప్పకూలింది. జేసన్ హోల్డర్ (79 బంతుల్లో 45 పరుగులు, 3 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ అంతా చేతులెత్తేశారు. షెపర్డ్ (36), బ్రాండన్ కింగ్ (22), పూరన్ (21) ఉన్నవారిలో కాస్త మెరుగ్గా ఆడారు. ఐదుగురు బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోరు కూడా దాటలేకపోయారు. స్కాట్లాండ్ బౌలర్లలో బ్రాండన్ మెక్‌ముల్లన్ 3, క్రిస్ సోల్, మార్క్ వాట్, క్రిస్ గ్రీవ్స్ చెరో 2 వికెట్లు తీశారు.
182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్.. 43.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ మాథ్యూ క్రాస్ (107 బంతుల్లో 74 నాటౌట్, 7 ఫోర్లు), బ్రాండన్ మెక్‌ముల్లన్ (106 బంతుల్లో 69, 8 ఫోర్లు, ఒక సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించారు. జేసన్ హోల్డర్, రొమెరో షెపర్డ్, అకిల్ హౌసెన్ తలో వికెట్ తీశారు. బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌లో మెరిసిన బ్రాండన్ మెక్‌ముల్లన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
ప్రత్యర్థుల బలం కంటే.. వెస్టిండీస్ స్వయంకృపరాధమే వరల్డ్ కప్ రేసు నుంచి తప్పుకోవడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. జట్టులో ఒంటిచెత్తో మ్యాచ్‌ను గెలిపించే ఆటగాళ్లు ఉన్నా.. సమష్టిగా ఆడడంలో మాత్రం విఫలమయ్యారు. ఫీల్డింగ్ ఘోరంగా ఉంది. మిస్ ఫీల్డ్ చేయడంతోపాటు క్యాచ్‌లను అందుకోలేకపోయారు. ఓటమి అనంతరం జట్టు కెప్టెన్ షాయ్ హోప్ ఆటగాళ్లపై సీరియస్ అయ్యాడు. తమ జట్టు ఓటమికి ఏదో ఒక కారణం చెప్పలేనని.. ఆటగాళ్లలో గెలవాలన్న దృక్పథం లోపించిందన్నాడు. తాము ప్రతి మ్యాచ్‌లో వంద శాతం రాణించలేకపోయామని అన్నారు. తమ జట్టులో టాలెంట్ ప్లేయర్లకు కొదవలేదనని.. కానీ కలిసికట్టుగా ఆడాల్సి ఉందన్నాడు.
Also Read: Twitter Limit: ట్విట్టర్ యూజర్లకు షాక్.. ఎలన్ మస్క్ సంచలన నిర్ణయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి