విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డ్.. సచిన్, లారాను దాటేసిన కోహ్లీ

విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డ్.. సచిన్, లారాను దాటేసిన కోహ్లీ

Last Updated : Jun 27, 2019, 06:13 PM IST
విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డ్.. సచిన్, లారాను దాటేసిన కోహ్లీ

టీమిండియా కెప్టేన్ విరాట్ కోహ్లీ తన ఖాతాలో మరో రికార్డును నమోదు చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో రన్ మెషిన్‌గా పేరు తెచ్చుకున్న కోహ్లీ గురువారం వెస్ట్ ఇండీస్‌తో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్‌లో 20,000 అంతర్జాతీయ పరుగులు పూర్తిచేసిన క్రికెటర్‌గా రికార్డ్ సాధించాడు. వెస్ట్ ఇండీస్‌ కెప్టేన్ జేసన్ హోల్డర్ బౌలింగ్‌లో 37 పరుగులు పూర్తి చేసిన అనంతరం కోహ్లీ ఈ మైలు రాయిని అందుకోవడం విశేషం. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియం విరాట్ కోహ్లీ రికార్డుకు వేదికైంది.

తాజా రికార్డుతో 20,000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసిన క్రికెటర్ల జాబితాలో సచిన్ టెండుల్కర్, బ్రియన్ లారా వంటి దిగ్గజాల ఖాతాలో విరాట్ కోహ్లీ చేరిపోయాడు. 

Trending News