కెప్టెన్ గా విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు !!

రికార్టుల రారాజు విరాట్ కోహ్లీ ..కెప్టెన్సీ విభాగంలో సరికొత్త రికార్డు సృష్టించాడు

Last Updated : Sep 3, 2019, 06:26 PM IST
కెప్టెన్ గా విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు !!

టీమిండియా సారథిగా విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు భారత్ కు ప్రాతినిథ్యం వహించిన టెస్టు క్రికెట్ కెప్టెన్లలో అత్యధిక అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్ గా నిలిచాడు. అది కూడా అతి తక్కువ మ్యాచుల్లో ఈ ఘతన సాధించాడు. టీమిండియా  కెప్టెన్ గా కోహ్లీ మొత్తం  48 టెస్టు  మ్యాచులకు  కెప్టెన్సీ వహించాడు. ఇందులో ఇండియా మొత్తం 28  మ్యాచ్ లు గెలుపొందగా..  10 మ్యాచ్ లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అలాగే 10 మ్యాచులను డ్రాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మొత్తం కెప్టెన్ గా విరాట్ కోహ్లీ విన్నింగ్ రేట్ చూసినట్లయితే 58.33  శాతంగా ఉంది.

కాగా కోహ్లీ తర్వాతి స్థానంలో మహేందర్ సింగ్ ధోని ఉన్నాడు. ధోనీ మొత్తం 60 మ్యాచులకు కెప్టెన్సీ వహించగా ఇందులో 27 మ్యాచులు భారత్ గెలుపొందింది. కాగా 18 మ్యాచులు ఓటమి చవిచూడాల్సి వచ్చింది.  కాగా ఇందులో 15 మ్యాచ్ లు డ్రాతో సరిపెట్టుకొవాల్సి వచ్చింది.  ధోనీ కెప్టెన్సీలో  విన్నింగ్ రేటు 45 శాతంగా  నదైంది. ఇదిలా ఉంటే సౌరబ్ గంగూలీ 49 మ్యాచులకు కెప్టెన్సీ వహించగా... ఇందులో 21 మ్యాచ్ లు భారత్ గెలుపొందగా..13 మ్యాచుల్లో ఓటమి చెందింది. మిగిలిన 15 మ్యాచ్ లు డ్రాగా ముగిశాయి. గంగులీ కెప్టెన్సీలో భారత్ విన్నింగ్ రేటు 42.86 శాతంగా నమోదు అయింది. 

Trending News