ఒకే ఒక్కడు..

ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన 2020లో అత్యధిక పారితోషికం పొందిన టాప్ 100 అథ్లెట్ల జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక క్రికెటర్‌గా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలిచాడు. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న

Last Updated : May 30, 2020, 06:32 PM IST
ఒకే ఒక్కడు..

హైదరాబాద్: ఫోర్బ్స్ (forbes) మ్యాగజైన్ విడుదల చేసిన 2020లో అత్యధిక పారితోషికం పొందిన టాప్ 100 అథ్లెట్ల జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక క్రికెటర్‌గా భారత కెప్టెన్ (Virat Kohli) విరాట్ కోహ్లీ నిలిచాడు. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారత క్రీడాకారుడు, బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ... ఫోర్బ్స్ ప్రకారం, కోహ్లీ ఆదాయం 26 మిలియన్లు. బహుమతుల ద్వారా డబ్బు, జీతాలు, కాంట్రాక్ట్ బోనస్, ఎండార్స్‌మెంట్లు, రాయల్టీలు, వివిధ రాబడులు ఫోర్బ్స్ లెక్కలోకి జూన్ 1, 2019 నుండి జూన్ 1, 2020 వరకు పరిగణలోకి తీసుకున్నారు. 

Also Read: వలస కార్ముకులపై ఔదార్యం చూపిన అమితాబ్ బచ్చన్..

ఫోర్బ్స్ టాప్ 100 అత్యధిక పారితోషికం పొందిన అథ్లెట్ల జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడిగా కోహ్లీకి ఇది వరసగా రెండో సంవత్సరం. 2019 లో 25 మిలియన్ల ఆదాయంతో 100 వ స్థానంలో నిలిచాడు. ఇదిలాఉండగా స్విస్ టెన్నిస్ గొప్ప (Roger Federer) రోజర్ ఫెదరర్ ఫోర్బ్స్ అత్యధిక పారితోషికం పొందిన అథ్లెట్ల జాబితాలో మొదటిస్థానం. గత 12 నెలల్లో 106.3 మిలియన్ డాలర్లు సంపాదించి పోర్చుగీస్ ఫుట్‌బాల్ సూపర్ స్టార్ క్రిస్టియానో ​​రొనాల్డోను అగ్రస్థానం నుండి వెనెక్కి నెట్టేశాడు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News