Virat Kohli : విరాట్ తాగే వాటర్ లీటర్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!

Virat Kohli : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆహారం విషయంలోనే కాకుండా తాగే నీటి విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తారు. కోహ్లీ.. మినరల్ వాటర్ కు బదులు ఎక్కువగా బ్లాక్ వాటర్ ను తాగుతారు. ఆ వాటర్ లీటర్ ధర తెలిస్తే మీరు షాక్ అవ్వక తప్పదు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 22, 2021, 09:32 PM IST
  • ఫిటినెస్ పై విరాట్ కోహ్లీ దృష్టి
  • మినరల్ వాటర్ బదులు బ్లాక్ వాటర్ తాగుతున్న విరాట్
  • బ్లాక్‌ వాటర్‌ లీటర్‌ ధర రూ.3000-4000.
Virat Kohli : విరాట్ తాగే వాటర్ లీటర్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!

Virat Kohli : టీమ్‌ ఇండియా సారథి విరాట్ కోహ్లీ కూడా ఫిట్‌నెస్‌కి అత్యంత ప్రాధాన్యమిస్తారన్న విషయం తెలిసిందే. ఆయన చేసే వర్కౌట్‌ వీడియోలను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటుంటారు విరాట్ కోహ్లి. ఇక ఆయన డైట్‌ విషయానికొస్తే ఆచితూచి వ్యవహరిస్తారు. ఇవి కేవలం ఆహారానికే వర్తిస్తాయనుకుంటే పొరపాటే.. ఆయన మినరల్‌ వాటర్‌ కి బదులు ‘బ్లాక్‌ వాటర్‌’ని సేవిస్తారట. 

బ్లాక్ వాటర్(Black Water) బాటిల్‌ లీటర్‌ ధర తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే. ఎందుకంటారా.. మినరల్‌ వాటర్‌ బాటిల్‌ లీటర్‌ రూ.20-40 ఉంటే.. బ్లాక్‌ వాటర్‌ లీటర్‌ ధర రూ.3000-4000 ఉంటుందట. ఇది ఫ్రాన్స్‌(France) నుంచి దిగుమతి అవుతుంది.  కరోనా(Corona) ప్రారంభం నుంచి బ్లాక్‌ వాటర్‌ తాగడం మొదలెట్టాడు కోహ్లీ(Kohli).  కేవలం కోహ్లీ మాత్రమే కాదు, బాలీవుడ్‌ హీరోయిన్లు ఊర్వశి రౌటేలా, మలైకా అరోడా, దక్షిణాది తార శ్రుతిహాసన్‌(Shrutihasan‌) ఫిట్‌గా ఉండేందుకు ఇదే సేవిస్తున్నారు.

Also Read: IPL 2021: పూల్ వాలీబాల్ ఆడిన Mumbai Indians

బ్లాక్‌ వాటర్‌ వల్ల కలిగే ప్రయోజనాలు
బ్లాక్‌ వాటర్‌(Black Water)లో సహజసిద్ధమైన అల్కలైన్‌(Alkaline‌) ఉంటుంది. ఇవి మీ శరీరాన్ని హైడ్రేటెడ్‌, ఫిట్‌గా ఉండేలా చేస్తుంది. తద్వారా వ్యాధులు నుంచి దూరం ఉండొచ్చు. ఇందులో ఉండే 70 శాతం ఖనిజాలు మీ జీర్ణప్రక్రియ, రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మనం రోజూ తాగే నీరులో pH స్థాయి 7 మాత్రమే ఉంటే.. బ్లాక్‌ వాటర్‌లో 7 కంటే ఎక్కువ ఉండటం గమనార్హం. అందుకే ఇందులో యాంటీ ఏజెంట్‌ గుణాలు ఉంటాయి. చర్మం యవ్వనంగా ఉండేందుకు తోడ్పడుతుంది.  గుజరాత్‌లోని వడోదర(Vadodara)లోని ఏవీ ఆర్గానిక్స్‌ అనే అంకుర సంస్థ ‘‘ ఎవోకస్‌(evocus)’’ పేరుతో బ్లాక్‌వాటర్‌ తయారీని ప్రారంభించింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News