India Vs South Africa World Cup 2023 Updates: తన బర్త్ డే రోజు టీమిండియా రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో చరిత్ర సృష్టించాడు. అద్భుత ఫామ్‌లో కోహ్లీ.. పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్‌కు పర్ఫెక్ట్ ట్రీట్ ఇచ్చాడు. ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ శతకంతో చెలరేగాడు. ఈ క్రమంలో వన్డేల్లో అత్యధిక సెంచరీల సచిన్ టెండూల్కర్ (49) రికార్డును సమం చేశాడు. కోహ్లీ బంతుల్లో 121 బంతుల్లో 101 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కోహ్లీకి తోడు శ్రేయాస్ అయ్యర్ (77) చెలరేగడంతో టీమిండియా 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. 327 రన్స్ టార్గెట్‌తో సఫారీ జట్టు బరిలోకి దిగనుంది.
టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ ఎంచుకోగా.. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ తొలి వికెట్‌కు 5.5 ఓవర్లలోనే 62 పరుగులు జోడించారు. 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 24 బంతుల్లోనే 40 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. అనూహ్యంగా రబడా బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. అనంతరం గిల్ (23)ను కేశవ్ మహారాజ్ క్లీన్ బౌల్డ్ చేయడంతో 93 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. ఈ దిశలో విరాట్ కోహ్లీకి జత కలిసిన శ్రేయాస్ అయ్యర్.. సఫారీ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.
36.5 ఓవర్లలో 227 పరుగులు ఉన్నప్పుడు శ్రేయాస్ అయ్యర్ (87 బంతుల్లో 77, 7 ఫోర్లు, 2 సిక్సర్లు) ఔట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ (8) కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేదు. విరాట్ కోహ్లీ క్రీజ్‌లో పాతుకుపోగా.. సూర్యకుమార్ యాదవ్ (14 బంతుల్లో 22, 5 ఫోర్లు), రవీంద్ర జడేజా (15 బంతుల్లో 29 నాటౌట్, 3 ఫోర్లు, ఒక సిక్స్) దూకుడుగా ఆడారు. కోహ్లీ (121 బంతుల్లో 101, 10 ఫోర్లు) నాటౌట్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగిడి, జాన్సన్, రబడా, కేశవ్ మహారాజ్, షమ్సీ చెరో వికెట్ తీశారు.
Also Read: Election Survey 2023: ఆసక్తి రేపుతున్న ఆ సర్వే, తెలంగాణ, ఎంపీ, రాజస్థాన్‌లో అధికారం ఎవరిది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook