భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నారు. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన విరాట్ 934 రేటింగ్ పాయింట్లతో చెలరేగి స్టీవ్ స్మిత్‌ను దాటి నెంబర్ వన్ ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు. 2015 నుంచి స్టీవ్ స్మిత్ నెంబర్ వన్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా... ఇప్పటివరకు 67 టెస్టు మ్యాచులు ఆడిన కోహ్లీ తొలిసారిగా ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానానికి చేరుకోవడమే గాక కెరీర్‌లోనే అత్యధికంగా 934 రేటింగ్ పాయింట్లను సాధించాడు.
KOHLI IS NO.1@imVkohli has overtaken Steve Smith to become the new No.1 batsman in @MRFWorldwide ICC Test Rankings.
He is the first Indian since @sachin_rt to get there.
READ ⬇️https://t.co/Hw7OCimIKw pic.twitter.com/s8h4fNmJYK
— ICC (@ICC) August 5, 2018
Numero Uno! #TeamIndia captain @imVkohli overtakes Steve Smith to become the new no.1 batsman in the ICC Test rankings. He is the 1st Indian to be No.1 since the great @sachin_rt who achieved this in 2011. pic.twitter.com/Q6ZXWnM9vh
— BCCI (@BCCI) August 5, 2018
కాగా సచిన్ టెండూల్కర్(2011లో) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత క్రికెటర్ కోహ్లీయే. 934 పాయింట్లతో.. కుమార్ సంగక్కర (938) తర్వాత టెస్ట్ చరిత్రలో అత్యధిక రేటింగ్ సాధించిన రెండో ఆసియా బ్యాట్స్‌మెన్ కోహ్లీ.
కోహ్లీ ఖాతాలో మరో రికార్డు వచ్చిపడింది. ఇంగ్లండ్‌తో తొలి టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లో కలిపి కోహ్లీ 200 పరుగులు సాధించగా.. టెస్టుల్లో ఎక్కువసార్లు ఒక మ్యాచ్‌లో 200 పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గానూ, ఒక టెస్టులో అత్యధిక పరుగులు (200) సాధించిన రెండో టీమిండియా కెప్టెన్‌గానూ రికార్డు నెలకొల్పారు. అంతేకాదు.. కోహ్లీ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సెంచరీలు చేసిన ఐదు టెస్ట్‌ల్లో కూడా జట్టు ఓటమిపాలైంది. తద్వారా వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రెయిన్ లారా కెప్టెన్‌గా నమోదు చేసిన చెత్త రికార్డు(ఐదు టెస్టుల్లోనూ)ను ఇప్పుడు కోహ్లి సమం చేశాడు.
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ@1