కోహ్లీ - అనుష్కల పెళ్లి గురించి అంతటా ఉత్కంఠత నెలకొన్న విషయం తెలిసిందే. ఎక్కడ చూసినా అభిమానుల్లో ఇదే చర్చ.. ఎప్పుడు వీళ్లిద్దరు ఒక్కటౌరనే ఆలోచనలో సగటు అభిమాని. వీరి పెళ్లి కోసం వేయికళ్లతో ఎదురు చూస్తన్న ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ . కోహ్లీ - అనుష్కల పెళ్లి మూహుర్తం దగ్గర పడినట్లు తెలిసింది. తాజాగా వీరిద్దరూ డిసెంబరులో పెళ్లి పీటలెక్కనున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఈ విషయంలో విరాట్ - అనుష్కల కుటుంబ సభ్యుల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
కోహ్లీ వ్యక్తిగత కారణాల వల్ల డిసెంబరులో క్రికెట్ నుంచి విశ్రాంతి కల్పించమని బీసీసీఐని కోరిన సంగతి తెలిసిందే. దీంతో పెళ్లి కోసమే కోహ్లీ విరామం అడిగాడని పలువురు అభిప్రాయపడుతున్నారు. డిసెంబరు చివరి వారంలో భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనకు ముందుగానే వివాహం చేసుకోవాలని భావించిన కోహ్లీ శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్‌ల నుంచి విశ్రాంతి కోరినట్లు సమాచారం.