Virat Kohli: రోహిత్ సరసన చేరేందుకు మరో 53 పరుగుల దూరంలో విరాట్...

IPL Record-Virat Kohli: ఐపీఎల్‌లో ఒకే జట్టుపై 1000 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ క్లబ్‌లో చేరేందుకు చేరువలో ఉన్నాడు కోహ్లి. ఇప్పటివరకూ రోహిత్ ఒక్కడే ఈ ఫీట్ సాధించగా... కోహ్లి రెండో ప్లేయర్‌గా ఆ జాబితాలో చేరేందుకు 53 పరుగుల దూరంలో ఉన్నాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 12, 2022, 12:17 PM IST
  • రోహిత్ శర్మ సరసన చేరనున్న విరాట్
  • మరో 53 పరుగులు చేస్తే ఆ రికార్డు
  • ఇప్పటివరకూ ఆ ఘనత సాధించినది రోహిత్ ఒక్కడే
Virat Kohli: రోహిత్ సరసన చేరేందుకు మరో 53 పరుగుల దూరంలో విరాట్...

IPL Record-Virat Kohli: ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లి రోహిత్ శర్మ రికార్డును సమం చేసేందుకు చేరువలో ఉన్నాడు. ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో ఆడే మ్యాచ్‌లో విరాట్ 53 పరుగులు చేస్తే.. ఐపీఎల్‌లో ఒకే జట్టుపై 1000 పరుగులు సాధించిన రెండో ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పుతాడు. ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌‌గా రోహిత్ శర్మ ఇదివరకే రికార్డుల్లోకి ఎక్కాడు. 

రోహిత్ శర్మ కోల్‌కతాపై 30 ఇన్నింగ్స్‌ల్లో 130.51 స్ట్రైక్ రేటుతో 1018 పరుగులు చేసి... ఐపీఎల్‌లో ఒకే జట్టుపై వెయ్యి పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇప్పుడా రికార్డును సమం చేసేందుకు కోహ్లి మరో 53 పరుగుల దూరంలో ఉన్నాడు. విరాట్ కోహ్లి ఇప్పటివరకూ చెన్నై సూపర్ కింగ్స్‌పై 21 ఇన్నింగ్స్‌ల్లో 127.25 స్ట్రైక్ రేటుతో 948 పరుగులు చేశాడు. 

ఇక ఇవాళ్టి మ్యాచ్ విషయానికొస్తే... ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా చెన్నై-బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఇప్పటివరకూ ఆడిన మ్యాచ్‌లను బట్టి చూస్తే ఆర్సీబీనే ఈ మ్యాచ్‌లో హాట్ ఫేవరెట్ అని చెప్పాలి. ఆర్సీబీ ఇప్పటివరకూ ఆడిన 4 మ్యాచ్‌ల్లో మూడింట్లో నెగ్గింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మాత్రం 4 మ్యాచ్‌లు ఆడి నాలుగింట ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లోనైనా చెన్నై రాత మారుతుందేమో చూడాలి. 

Also Read: iPhone SE 3 Offers: రూ.43,900 విలువైన iPhone SE స్మార్ట్ ఫోన్ ఇప్పుడు రూ.28,900లకే!

Also Read: Covid 19: పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యంపై కరోనా ఎఫెక్ట్.. తాజా పరిశోధనలో షాకింగ్ విషయాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News