దేశవాళీ క్రికెట్లో సంచలనం.. ముస్తాక్ అలీ టోర్నీలో యువ బౌలర్ డబుల్ హ్యాట్రిక్

Darshan Nalkande Hat Trick: భారత దేశవాళీ క్రికెట్లో సంచనం నమోదయ్యింది. సయ్యిద్ ముస్తాక్ అలీ టోర్నీ సెమీఫైనల్లో కర్ణాటక పై మ్యాచ్ లో విదర్భ బౌలర్ దర్శన్ నల్కండే డబుల్ హ్యాట్రిక్ సాధించాడు. టీ20 క్రికెట్లో ఈ ఘనత సాధించిన రెండో బౌలర్ గా నల్కండే నిలిచాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 21, 2021, 09:23 AM IST
దేశవాళీ క్రికెట్లో సంచలనం.. ముస్తాక్ అలీ టోర్నీలో యువ బౌలర్ డబుల్ హ్యాట్రిక్

Darshan Nalkande Hat Trick: దేశవాళీ క్రికెట్లో శనివారం సంచలన నమోదయ్యింది. ఎంతోమంది స్టార్ బౌలర్లకు సాధ్యం కాని ఫీట్ ను యువ బౌలర్ సాధించాడు. ముస్తాక్ అలీ టోర్నీలో విదర్భ ఆటగాడు దర్శన్ నల్కండే ఏకంగా ఒకే ఓవర్‌లోని వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించాడు. టీ20 క్రికెట్లో ఈ ఘనత సాధించిన రెండో బౌలర్ గా ఘనత సాధించాడు.

సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక జరిగిన సెమీఫైనల్ లో కర్ణాటక, విదర్భ జట్లు తలపడ్డాయి. మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కర్ణాటక భారీ స్కోర్ దిశగా దూసుకుపోయింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులను రాబట్టింది. ఓపెనర్లు రోహన్ కదమ్ (87), మనీష్ పాండే (54) చెలరేగి ఆడారు. దీంతో తొలి వికెట్‌కు 132 పరుగుల భాగస్వామ్యం లభించింది. అయితే ఆ తర్వాత వచ్చిన అభినవ్ మనోహర్ ఆ దూకుడును కొనసాగించాడు.

అదే సమయంలో విదర్భ బౌలర్ దర్శన్ నల్కండే మ్యాజిక్ చేశాడు. ఆఖరి వోవర్ వేయడానికి వచ్చిన నల్కండే తొలి బంతి డాట్ బాల్ వేశాడు. రెండో బంతికి అనిరుద్ద జోషి (1) యశ్ ఠాకూర్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. మూడో బంతికి శరత్ బీఆర్ (0) అక్షయ్ వాడ్కర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఇక నాలుగో బంతికి జే సుచిత్ (0) వాంఖడేకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దర్శన్ నల్కండే వికెట్ల వేట అక్కడితో ఆగలేదు. ఆ తర్వాత బంతికి దూకుడు మీద ఉన్న అభినవ్ మనోహర్ (27) అథర్వ తైదేకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇలా వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి దర్శన్ డబుల్ హ్యాట్రిక్ సాధించాడు.

ఈ డబుల్ హ్యాట్రిక్ ఘనత ను టీమ్ఇండియా మాజీ పేసర్ అభిమన్యు మిథున్ ఇలాంటి ఘనతనే సాధించాడు. 2019లో కర్ణాటక తరపున ఆడుతున్న సమయంలో హర్యాణాతో జరిగిన ఒక మ్యాచ్‌లో వరుసగా ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీశాడు. ఇప్పటికీ ఆ రికార్డు చెక్కుచెదరలేదు. డబుల్ హ్యాట్రిక్ తీసిన తొలి భారత బౌలర్‌గా అభిమన్యు మిథున్ రికార్డులకు ఎక్కాడు.

అంతర్జాతీయ స్థాయిలో మాత్రం డబుల్ హ్యాట్రిక్ ఘనత లసిత్ మలింగ పేరున ఉన్నది. 2019లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుసగా నాలుగు వికెట్లు తీసి మలింగ సంచలనం సృష్టించాడు. అయితే ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఫీట్ ఎవరూ సాధించలేకపోయారు. ఇక దర్శన్ నల్కండే ప్రస్తుతం ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు. గత రెండు సీజన్లలో అతడు పంజాబ్ జట్టుకు ఆడుతున్నా పెద్దగా అవకాశాలు రాలేదు. 

Also Read: క్లీన్ స్వీప్ పై కన్నేసిన టీమ్ఇండియా.. చివరి టీ20లో విజయం కోసం న్యూజిలాండ్

Also Read: మైదానంలోకి దూసుకొచ్చిన రోహిత్ అభిమాని.. కాళ్లపై పడి.. తరువాతేం జరిగింది..??

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News