ఈ ఐపీఎల్ విజయం ఎంతో ప్రత్యేకం: ఎంఎస్ ధోనీ

ఐపీఎల్ ఫైనల్లో హైదరాబాద్ పై ఘనవిజయం సాధించడం పట్ల చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సంతోషం వ్యక్తం చేశారు.

Last Updated : May 28, 2018, 11:09 PM IST
ఈ ఐపీఎల్ విజయం ఎంతో ప్రత్యేకం: ఎంఎస్ ధోనీ

ఐపీఎల్ ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఘనవిజయం సాధించడం పట్ల చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సంతోషం వ్యక్తం చేశారు. ఇది సమిష్టి విజయమని.. ఈ గెలుపు ఎంతో ప్రత్యేకమైందని అన్నారు. 'నా జెర్సీ నెంబర్ 7.. గెలుపొందిన తేదీ 27. చెన్నై సూపర్ కింగ్స్‌కు ఇది ఏడో ఫైనల్' అని ధోనీ అన్నాడు. అటు సొగసైన ఆటగాడిగా పంత్ (ఢిల్లీ) నిలువగా, ఉత్తమ క్యాచ్ అవార్డ్ బౌల్డ్ (ఢిల్లీ)కు దక్కింది. ఇక పర్పుల్ క్యాప్ అండ్రూ టై (పంజాబ్), ఆరెంజ్ క్యాప్ విలియమ్సన్(హైదరాబాద్) వశమైంది.

 

Thanks everyone for the support and Mumbai for turning yellow.Shane ‘shocking’ Watson played a shocking innings to get us through.end of a good season.Ziva doesn’t care about the trophy, wants to run on the lawn according to her wordings.

A post shared by M S Dhoni (@mahi7781) on

ముంబైలోని వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జ‌రిగిన ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు చెన్నైకు రూ.20 కోట్లు అందించారు. ఓడిన జట్టు హైదరాబాద్‌కు రూ.12.5 కోట్లు అంద‌జేశారు.

ఎనిమిది వికెట్ల తేడాతో హైదరాబాద్ పై చెన్నై విజయం

వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్-11 సీజన్ ఫైనల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవ‌ర్లకు గాను ఆరు వికెట్ల న‌ష్టానికి 178 ప‌రుగులు చేసి  చెన్నై సూప‌ర్ కింగ్స్ ముందు 179 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యాన్ని ఉంచింది. చెన్నై జ‌ట్టు 179 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించింది. ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ షేన్ వాట్సన్ సెంచరీ చేశాడు. వాట్సన్ 51 బంతుల్లో 8 సిక్స్ లు, ఏడు ఫోర్లతో సెంచరీ చేశాడు. చెన్నై నిర్ణీత 20 ఓవ‌ర్లలో 18.3వ ఓవ‌ర్లకు 181 ప‌రుగులు చేసింది. దీంతో ఎనిమిది వికెట్ల తేడాతో హైద‌రాబాద్‌పై చెన్నై విజ‌యం సాధించింది.

ఐపిఎల్‌ టైటిల్‌ సాధించడం చెన్నైకు ఇది మూడోసారి. 2010, 2011ల్లోనూ చెన్నై టైటిల్‌ గెలుచుకుంది. 2008, 2012, 2013, 2015ల్లో రన్నరప్‌గా నిలిచింది. మరోవైపు రన్నరప్‌గా నిలవడం హైదరాబాద్‌కు ఇది మొదటిసారి. 2016లో హైదరాబాద్‌ విజేతగా నిలిచింది.

ఐపీఎల్ పూర్తి అవార్డుల జాబితా:

ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్: రిషబ్ పంత్

ఫెయిర్ ప్లే అవార్డు: ముంబై ఇండియన్స్

క్యాచ్ ఆఫ్ ది టోర్నమెంట్: ట్రెంట్ బౌల్ట్ (విరాట్ కోహ్లి క్యాచ్)

సీజన్ యొక్క సూపర్ స్ట్రైకర్: సునీల్ నరైన్

సీజన్ యొక్క స్టైలిష్ ఆటగాడు: రిషబ్ పంత్

ఇన్నోవేటివ్ థింకింగ్: ఎంఎస్ ధోనీ

పర్పుల్ క్యాప్: ఆండ్రూ టై

ఆరెంజ్ క్యాప్: కేన్ విలియమ్సన్

మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్: సునీల్ నరైన్

Trending News