IND vs WI: టీమ్ ఇండియా చితక్కొట్టింది. వెస్టిండీస్‌తో జరుగుతున్న నాలుగవ టీ20లో టీమ్ ఇండియా కుర్రోళ్లు అదగరగొట్టేశారు. మొదటి రెండు మ్యాచ్‌ల పరాజయానికి దీటైన సమాధానమిచ్చారు. ఓపెనర్లు శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్ మెరుపులు మెరిపించారు. రికార్డులు బద్దలు గొట్టారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
వెస్టిండీస్‌తో జరిగిన నాలుగవ టీ20లో టీమ్ ఇండియా భారీ విజయం సాధించింది. ఓపెనర్లు మొదటి వికెట్‌కు 165 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి ప్రత్యర్ధి జట్టును బెంబేలెత్తించారు. వెస్టిండీస్ జట్టుపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. అంతేకాకుండా వరుసగా ముడు, నాలుగు మ్యాచ్ విజయాలతో సిరీస్‌ను 2-2గా సమం చేసింది. ఇక మిగిలిన మ్యాచ్ ఎవరు గెలిస్తే సిరీస్ ఆ జట్టుకు దక్కనుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. షీమన్ హెట్ మెయిర్ అత్యదికంగా 61 పరుగులు చేయడా షాయీ హోప్ 45 పరుగులు చేశాడు.
మొదటి టీ20లో 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక బోల్తా పడిన టీమ్ ఇండియా నాలుగో టీ 20లో మాత్రం 179 పరుగుల లక్ష్యాన్ని అత్యంత సునాయసంగా ఛేదించేసింది. ఓపెనర్లు శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్ అదరగొట్టేశారు. శుభమన్ గిల్ 77 పరుగులు చేయగా, యశస్వి జైస్వాల్ 84 పరుగులు చేశాడు. యశస్వి జైస్వాల్ ప్రారంభం నుంచి దూకుడు ప్రదర్శించాడు. 7 ఓవర్లలోనే వంద పరుగులు దాటించేశారు. మొదటి వికెట్‌కు 165 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించాక శుభమన్ గిల్ అవుట్ అయ్యాడు. అప్పటికే ఇండియా 14 బంతుల్లో 27 పరుగులు చేయాల్సి ఉంది. ఆ తరువాత బరిలో దిగిన తిలక్ వర్మతో కలిసి 179 పరుగుల లక్ష్యాన్ని చేదించి 9 వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది.
యశస్వి జైస్వాల్ 51 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 84 పరుగులు చేయగా శుభమన్ గిల్ 47 బందుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 77పరుగులు చేశాడు. తిలక్ వర్మ 5 బంతుల్లో ఒక ఫోర్‌తో 7 పరుగులు చేసేసరికి టీమ్ ఇండియాకు విజయం ఖరారైంది. సిరీస్‌పై పట్టు సాధించాలంటే టీమ్ ఇండియాకు ఇది గెలవక తప్పని మ్యాచ్. ఎందుకంటే తొలి రెండు మ్యాచ్‌లు వెస్టిండీస్ విజయం సాధించగా మూడవ మ్యాచ్‌లో టీమ్ ఇండియా గెలిచింది. నాలుగో మ్యాచ్ కూడా ఇండియా గెలవడంతో సిరీస్ 2-2 సమమైంది. ఇక రేపు జరగనున్న చివరి మ్యాచ్ సిరీస్ ఎవరిదనేది తేల్చనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook