IPL 2022 RuPay: ఐపీఎల్‌ భాగస్వామిగా 'రూపే'.. మూడేళ్ల పాటు ఒప్పందం!!

RuPay as Official Partner for TATA IPL 2022: నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (రూపే) మూడేళ్ల పాటు ఐపీఎల్‌ టోర్నీకి అఫీషియల్ పార్ట్‌నర్‌గా ఉండేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 4, 2022, 08:00 AM IST
  • ఐపీఎల్‌ భాగస్వామిగా 'రూపే'
  • టైటిల్‌ స్పాన్సర్‌గా టాటా
  • రూ. 42 కోట్లకు ఐపీఎల్‌తో ఒప్పందం
IPL 2022 RuPay: ఐపీఎల్‌ భాగస్వామిగా 'రూపే'.. మూడేళ్ల పాటు ఒప్పందం!!

RuPay as Official Partner for TATA IPL 2022: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలో నడుస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్)కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. చాలా దేశాల్లో ఐపీఎల్ లీగ్‌కి భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అందుకే ఐపీఎల్‌ బ్రాండ్‌ విలువ అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. దీంతో ఐపీఎల్‌ టోర్నీలో భాగస్వామ్యం అయ్యేందుకు బడా కార్పొరేట్‌ సంస్థలు పోటీపడుతున్నాయి. 

దిగ్గజ సంస్థ 'టాటా' ఇప్పటికే ఐపీఎల్ టైటిల్‌ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. డ్రీమ్‌ 11, అన్‌ అకాడమీ, అప్స్టాక్స్, క్రెడ్‌, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌, సియట్‌, పేటీఎం వంటి సంస్థలు ఐపీఎల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (రూపే) చేరింది. రూపే మూడేళ్ల పాటు ఐపీఎల్‌ టోర్నీకి అఫీషియల్ పార్ట్‌నర్‌గా ఉండేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఎంత మొత్తంతో ఒప్పందం చేసుకుందనే విషయం తెలియరాలేదు కానీ.. ఏడాదికి రూ. 42 కోట్లకు ఐపీఎల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం తెలుస్తుంది. 

ఇదివరకు ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా చైనా మొబైల్ సంస్థ 'వివో' వ్యవహరించగా.. ఐపీఎల్ 2022 నుంచి 'టాటా' టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. ఇక మార్చి 26 నుంచి ఐపీఎల్ 15వ సీజన్ ఆరంభం కానుంది. త్వరలోనే పూర్తి షెడ్యూల్ రానుంది. ఇక మహారాష్ట్ర వేదికగా ఐపీఎల్‌ 15వ ఎడిషన్‌ లీగ్ మ్యాచులు జరగనున్నాయి. కరోనా కేసులు భారీ స్థాయిలో తగ్గిన నేపథ్యంలో స్టేడియాల్లో మ్యాచ్‌లను వీక్షించేందుకు ప్రేక్షకులకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. స్టేడియం సీటింగ్ కెపాసిటీలో 25 శాతం ప్రేక్షకులను అనుమతిస్తున్నారు. 

ఐపీఎల్ 2022  సెంట్రల్ స్పాన్సర్స్  జాబితా: 
# టాటా: టైటిల్ స్పాన్సర్
# డ్రీమ్ 11: అఫిషియల్ పార్ట్‌నర్‌
# అన్ అకాడమీ: అఫిషియల్ పార్ట్‌నర్‌
# క్రెడ్: అఫిషియల్ పార్ట్‌నర్‌
# అప్స్టాక్స్: అఫిషియల్ పార్ట్‌నర్‌
# స్విగ్గీ ఇన్స్టంట్: అఫిషియల్ పార్ట్‌నర్‌
# పేటీఎం: అఫిషియల్ అంపైర్ పార్ట్‌నర్‌ 
# సియట్: అఫిషియల్ స్ట్రాటజిక్ టైమ్ అవుట్ పార్ట్‌నర్‌
# రూపే: అఫిషియల్ పార్ట్‌నర్‌

Also Read: Gold Rate Today 4 March 2022: పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు! వెండి ధర మాత్రం..!!

Also Read: Horoscope Today March 4 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారి ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి!!

 

Trending News