Ind vs NZ match: న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో Hardik Pandya ఉంటాడా లేదా ?

Ind vs NZ match latest updates: పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్థిక్ పాండ్య భుజానికి గాయమైన (Hardik Pandya's shoulder injury) సంగతి తెలిసిందే. అయితే, తాజాగా హార్థిక్ పాండ్య భుజం స్కానింగ్‌లో అతడికి పెద్దగా సమస్య లేదని తేలినట్టు తెలుస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 27, 2021, 12:02 AM IST
Ind vs NZ match: న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో Hardik Pandya ఉంటాడా లేదా ?

Ind vs NZ match latest updates: ఐసిసి పురుషుల టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా అక్టోబర్ 31న ఆదివారం జరగనున్న ఇండియా vs న్యూజిలాండ్ మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్య ఆడుతాడా లేదా అనే సందేహాలకు సమాధానం లభించింది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్థిక్ పాండ్య భుజానికి గాయమైన (Hardik Pandya's shoulder injury) సంగతి తెలిసిందే. అయితే, తాజాగా హార్థిక్ పాండ్య భుజం స్కానింగ్‌లో అతడికి పెద్దగా సమస్య లేదని తేలినట్టు తెలుస్తోంది. రెండు మ్యాచుల మధ్య ఆరు రోజుల గ్యాప్ ఉంది కనుక ఆ గ్యాప్‌లో హార్థిక్ పాండ్య పూర్తిగా కోలుకునే అవకాశం ఉందని బీసీసీఐ భావిస్తోంది. 

ఐపిఎల్ 2021 లో బౌలింగ్ చేయని హార్థిక్ పాండ్య బ్యాటర్‌గానే సీజన్ పూర్తి చేశాడు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 బంతులు ఎదుర్కొన్న హార్థిక్ పాండ్య 11 పరుగులు మాత్రమే చేశాడు. షార్ట్ బాల్ తగిలి గాయపడిన హార్థిక్ పాండ్య (Hardik Pandya) క్రీజులో కొంత ఇబ్బందిగానే కనిపించాడు. 

Also read : T20 World Cup 2021: అదరగొట్టిన మార్‌క్రమ్‌...వెస్టిండీస్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం

అయితే, ఆ గాయం చిన్నదేనని స్కానింగ్‌లో తేలడంతో పాటు రెండు మ్యాచ్‌ల మధ్య 6 రోజుల గ్యాప్ ఉండటంతో హార్థిక్ పాండ్య న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌కి అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నాయని బీసీసీఐ అధికారి ఒకరు పీటీఐకి (BCCI about Hardik Pandya's shoulder injury) వెల్లడించారు. మెడికల్ టీమ్ సైతం హార్థిక్ పాండ్య ట్రైనింగ్ సెషన్‌లో ఎలా ఉంటాడనే అంశాలపై దృష్టిసారిస్తోంది.

ఇదిలావుంటే, హార్థిక్ పాండ్య బౌలింగ్ (Hardik Pandya bowling) సైతం ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తోంది. ఐపిఎల్ 2021 లో (IPL 2021) బ్యాటింగ్ తప్ప బౌలింగ్ జోలికి వెళ్లని హార్థిక్ పాండ్య టీ 20 వరల్డ్ కప్ టోర్నీలో అయినా బౌలింగ్ చేస్తాడా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇదే విషయమై విరాట్ కోహ్లీ సైతం స్పందిస్తూ.. హార్థిక్ పాండ్య బౌలింగ్ చేయడానికి ఇంకా సమయం పడుతుందని తెలిపాడు. అయితే, టోర్నీలో ఏదో ఓ దశలో హార్థిక్ పాండ్య బౌలింగ్ చేస్తాడని మాత్రం కోహ్లీ (Virat Kohli) స్పష్టంచేశాడు.

Also read : Team India: టీమిండియా హెడ్‌కోచ్‌ నియామకానికి రాహుల్‌ ద్రవిడ్ దరఖాస్తు...NCA హెడ్ రేసులో లక్ష్మణ్!

Also read :  Pakistan Vs New Zealand: ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న పాకిస్తాన్‌ను న్యూజిలాండ్‌ నిలువరించగలదా..??

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News