T20 world Cup 2022, Ind vs Pak: టీ20 ప్రపంచకప్ లో హై ఓల్డేజ్ మ్యాచ్ కు సర్వం సిద్దమైంది. క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న దాయాదుల మధ్య పోరు షురూ అయింది. ఇవాళ చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ లు తమ తొలి మ్యాచ్ లో తలపడనున్నాయి. గత వరల్డ్ కప్ లో ఎదురైనా ఓటమికి బదులు తీర్చుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది. మళ్లీ టీమిండియాను ఇంటిదారి పట్టించాలని పాకిస్థాన్ చూస్తోంది. మెల్ బోర్న్ వేదికగా భారత్, పాకిస్థాన్ ల మధ్య మ్యాచ్ మధ్యాహ్నం 1.30 నుంచి ప్రారంభంకానుంది. మెల్‌బోర్న్ పిచ్ పేసర్లకు అనుకూలించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ కు వరణుడు అంతరాయం కలిగించే అవకాశం ఉంది.
భారత్ విషయానికొస్తే..
భారత బ్యాటింగ్ ఆర్డర్ బాగానే ఉంది. ఓపెనర్లు రోహిత్, రాహుల్, కోహ్లీ అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు. మిడిలార్డర్ కూడా పటిష్టంగానే కనిపిస్తోది. ముఖ్యంగా సూర్య కుమార్ యాదవ్ బీకర ఫామ్ లో ఉన్నాడు. రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్డిక్ పాండ్యాలు కూడా రాణిస్తున్నారు. అయితే టీమిండియా బౌలింగ్ కొంత కలవరానికి గురిచేస్తోంది. మన బౌలర్లు భారీగా పరుగులిస్తున్నారు. భువనేశ్వర్, షమీ, ఆర్షదీప్ సింగ్ పైన్ ఆశలు పెట్టుకుంది.
పాక్ విషయానికొస్తే..
పాకిస్థాన్ బ్యాటింగ్ విషయానికొస్తే కెప్టెన్ బాబర్ అజామ్, వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిజ్వాన్ భీకర ఫామ్ లో ఉన్నారు. ఈ జోడి చాలా డేంజరస్. వీరిద్ధరూ రాణించడంపైనే పాక్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. షాన్ మసూద్, హైదర్ అలీ, ఇఫ్తికార్ అహ్మద్ వంటి ఆటగాళ్లు మంచి బ్యాటర్లే కానీ వీరికి నిలకడ లేదు. వీరు కుదురుకుంటే దాయాది జట్టుకు తిరుగు ఉండదు. ఆ జట్టు బౌలింగ్ బాగానే ఉంది. ముఖ్యంగా భారత్ పై షహీన్ షా అఫ్రిది చెలరేగిపోతాడు. గత ప్రపంచకప్ లో మన ఓటమికి ఇతడే కారణం. మిగతా బౌలర్లైన హారిస్ రవూఫ్, నసీమ్ షా, నవాజ్, షాదాబ్‌లు షహీన్ కు ఎంతవరకు సహకరిస్తానరనేది చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook