ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ 2022 రసవత్తరంగా సాగుతోంది. టీమ్ ఇండియా నాలుగవ సూపర్ 12 మ్యాచ్ రేపు బంగ్లాదేశ్‌తో జరగనుంది. ఈ నేపధ్యంలో టీమ్ ఇండియాలో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. నలుగురు అవుట్ అయ్యారు.
టీ20 ప్రపంచకప్ 2022లో తొలి రెండు మ్యాచ్‌లు పాకిస్తాన్, నెదర్లాండ్స్‌పై విజయం తరువాత మూడవ మ్యాచ్ దక్షిణాఫ్రికా చేతిలో పరాజయం పాలైంది. బుధవారం నాడు బంగ్లాదేశ్‌తో నాలుగవ మ్యాచ్ ఆడిలైడ్ వేదికగా జరగనుంది. రేపు జరిగే మ్యాచ్‌లో ఏ జట్టు గెలిస్తే అదే గ్రూప్ 2లో టాప్‌లో నిలుస్తుంది. ఈ సందర్భంగా టీమ్ ఇండియాలో కీలక మార్పులు జరిగాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో చేసిన ప్రయోగం విఫలమైంది. అక్షర్ పటేల్ స్థానంలో దీపక్ హుడాను తీసుకోవడం వల్ల ప్రయోజనం లేకపోయింది. ఈసారి మరిన్ని మార్పులు చేశారు.
రేపటి మ్యాచ్‌లో దీపక్ హుడా స్థానంలో తిరిగి అక్షర్ పటేల్ వచ్చే అవకాశాలున్నాయి. మరోవైపు సౌత్ ఆఫ్రికా మ్యాచ్‌లో గాయపడిన దినేశ్ కార్తీక్ స్థానంలో రిషభ్ పంత్ వచ్చే పరిస్థితి ఉంది. ఇక రవిచంద్రన్ అశ్విన్ వైఫల్యం కూడా అతని స్థానాన్ని ప్రశ్నార్ధకం చేస్తోంది. అతని స్థానంలో యజువేంద్ర చాహల్ స్థానం దక్కించుకోవచ్చు. మొత్తానికి నలుగురు ఆటగాళ్లు అవుట్ కావచ్చని తెలుస్తోంది.
టీమ్ ఇండియా ప్లేయింగ్ 11
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్, అర్ధదీప్ సింగ్, మొహమ్మద్ షమి
Also read: Virat Kohli: ఫామ్‌లో విరాట్ కోహ్లీ.. అందులోనూ అడిలైడ్‌లో అద్భుత రికార్డ్స్! బంగ్లాదేశ్‌కు చుక్కలే ఇగ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook