Suresh Raina on Virat Kohli: ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కూడా నెగ్గలేదు, సురేష్ రైనా కామెంట్స్ వైరల్

Suresh Raina on Virat Kohlis captaincy:విరాట్ కోహ్లీ అత్యుత్తమ కెప్టెన్లలో ఒకరని భావిస్తున్నాను. కానీ అతడు సాధించాల్సింది ఇంకా చాలా ఉందని సురేష్ రైనా పేర్కొన్నాడు. ఆటగాడిగా అతడు ఎన్నో మైలురాళ్లు చేరుకున్నాడు, రికార్డులు తిరగరాసి ఉంటాడు. నెంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా అవార్డులు అందుకున్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 12, 2021, 02:00 PM IST
Suresh Raina on Virat Kohli: ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కూడా నెగ్గలేదు, సురేష్ రైనా కామెంట్స్ వైరల్

Suresh Raina on Virat Kohlis captaincy: టీ20 క్రికెట్‌లో విజయవంతమైన ఆటగాడిగా టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా గుర్తింపు సాధించుకున్నాడు. కెరీర్‌లోనూ వివాదాలకు దూరంగానే ఉన్నాడు. అయితే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

విరాట్ కోహ్లీ అత్యుత్తమ కెప్టెన్లలో ఒకరని భావిస్తున్నాను. కానీ అతడు సాధించాల్సింది ఇంకా చాలా ఉందని సురేష్ రైనా పేర్కొన్నాడు. ఆటగాడిగా అతడు ఎన్నో మైలురాళ్లు చేరుకున్నాడు, రికార్డులు తిరగరాసి ఉంటాడు. నెంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా అవార్డులు అందుకున్నాడు. కానీ ఐసీసీ ట్రోఫీ గురించి ప్రశ్నించే ముందు, అతడి కెప్టెన్సీలో ఒక్క ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) టైటిల్ కూడా సాధించలేదంటూ న్యూస్24కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సురేష్ రైనా ప్రస్తావించాడు. ఐపీఎల్ ట్రోఫీలు సాధించడానికి విరాట్ కోహ్లీ (Virat Kohli)కి మరింత సమయం పట్టవచ్చునని అభిప్రాయపడ్డాడు. త్వరలో టీ20 వరల్డ్ కప్, వన్డే ప్రపంచ కప్‌లు ఉన్నాయని, వాటిలో ఫైనల్‌కు చేరడం అంత ఆషామాషీ కాదన్నాడు.

Also Read: Wimbledon 2021 Winner: వింబుల్డన్ 2021 విన్నర్ Novak Djokovic, అత్యధిక టైటిల్స్‌తో రికార్డు

ఇటీవల జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో న్యూజిలాండ్ చేతిలో ఫైనల్లో భారత్ ఓటమిపాలైన నేపథ్యంలో సురేష్ రైనా ఈ వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా (Team India)ను చోకర్స్ అని పిలవడంపై రైనా ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీమిండియా మూడు ప్రపంచ కప్‌లు సాధించిందన్నాడు. 1983 వన్డే వరల్డ్ కప్, 2007లో టీ20 వరల్డ్ కప్ మరియు 2011 వన్డే వరల్డ్ కప్ సాధించి క్రికెట్‌లో తామేంటో భారత్ నిరూపించుకుందని గుర్తుచేశాడు. 

Also Read: Harbhajan Singh: ఫ్యాన్స్‌కు హర్భజన్ సింగ్ శుభవార్త, భల్లే భల్లే అంటున్న ఫ్యామిలీ

దిగ్గజ కెప్టెన్లు సౌరవ్ గంగూలీ మరియు మహేంద్ర సింగ్ ధోనీల కంటే విజయాల శాతం విరాట్ కోహ్లీకే అధికంగా ఉందని, కానీ ఒక్క ఐసీసీ ట్రోఫీ కోసం ఇంకా ఎదురుచూస్తున్నాడు. కెరీర్ విషయానికొస్తే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు సురేష్ రైనా ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News