Umran Malik: ఐపీఎల్ 2022 అవార్డుల ద్వారా.. ఉమ్రాన్‌ మాలిక్‌ ఎంత సంపాదించాడో తెలుసా?

Umran Malik wins INR 29 lakhs through awards in IPL 202. ఐపీఎల్ 2022 సీజన్‌లో మొత్తం అవార్డుల రూపంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ రూ. 29 లక్షలు సంపాదించాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 30, 2022, 08:05 PM IST
  • గంటకు 157 కిలోమీటర్ల వేగంతో బంతి
  • ఐపీఎల్ 2022 అవార్డుల ద్వారా
  • ఉమ్రాన్‌ మాలిక్‌ ఎంత సంపాదించాడో తెలుసా?
Umran Malik: ఐపీఎల్ 2022 అవార్డుల ద్వారా.. ఉమ్రాన్‌ మాలిక్‌ ఎంత సంపాదించాడో తెలుసా?

Sunrisers Hyderabad pacer Umran Malik wins INR 29 lakhs through awards in IPL 2022: ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్‌లను బెంబేలెత్తించిన విషయం తెలిసిందే. లీగ్ ఆసాంతం స్థిరంగా 150 కిమీ వేగంతో బౌలింగ్ చేశాడు. ఓసారి గంటకు 157 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించాడు. సన్‌రైజర్స్ ఆడిన అన్ని మ్యాచులలో ఫాస్టెస్ట్ డెలివరీ ఉమ్రాన్ మాలిక్‌దే అంటే.. అతడి వేగం ఎంతుంటుందో అర్ధం చేసుకోవచ్చు. హైదరాబాద్ ఆడిన ప్రతి మ్యాచులో 'ఫాస్టెస్ట్ డెలివరీ' అవార్డు మాలిక్‌దే. ఐపీఎల్ 2022 అవార్డుల ద్వారా మాలిక్‌ ఎంత సంపాదించాడో ఓసారి చూద్దాం.

ఐపీఎల్ 2022లో లీగ్ దశలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడిన ప్రతి మ్యాచులో ఫాస్టెస్ట్ డెలివరీ అవార్డు ఉమ్రాన్ మాలిక్‌కే దక్కింది. లీగ్ దశలో సన్‌రైజర్స్ 14 మ్యాచులు ఆడింది కాబట్టి అతడికి రూ. 14 లక్షలు వచ్చాయి. పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్‌పై అత్యుత్తమ ప్రదర్శన చేసిన మాలిక్‌కు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు రూపంలో రూ. 2 లక్షలు సంపాదించాడు. గుజరాత్, పంజాబ్ మ్యాచులలో 'గేమ్ ఛేంజర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డుల ద్వారా మరో రెండు లక్షలు వచ్చాయి.

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో 'మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు కూడా ఉమ్రాన్‌ మాలిక్‌కే దక్కింది. ఇందుకు గాను ఓ లక్ష ఖాతాలో పడింది. ఐపీఎల్ 2022 'ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్' అవార్డు కూడా దక్కింది. ఈ అవార్డు రూపంలో మరో రూ.10 లక్షలు వచ్చాయి. ఈ సీజన్‌లో మొత్తం అవార్డుల రూపంలో ఉమ్రాన్‌ రూ. 29 లక్షలు సంపాదించాడు. ఈ మొత్తం చూసిన క్రికెట్ ఫాన్స్ అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

ఉమ్రాన్ మాలిక్‌ ఐపీఎల్‌ 2022లో అద్భుతంగా రాణించాడు. తన పేస్‌ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించడమే కాకుండా.. వికెట్లు కూడా పడగొట్టాడు. 14 మ్యాచులో ఏకంగా 22 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసిన అతడికి బంపర్ ఆఫర్ దక్కింది. ఉమ్రాన్ ఏకంగా భారత జట్టలో చోటు దక్కించుకున్నాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరగనున్న టీ20 సిరీస్‌కు బీసీసీఐ అతడిని ఎంపిక చేసింది. 

Also Read: Kriti Sanon Pics: బ్లాక్ డ్రెస్సులో హాట్ హాట్ అందాలు ఆరబోసిన కృతి సనన్.. క్లీవేజ్ అందాలు చూస్తే అంతే..!

Also Read: IPL 2022 Awards List: ఐపీఎల్‌ 2022 అవార్డు విజేతలు వీరే.. ఆ ఐదు అవార్డులు బట్లర్‌కే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

 

Trending News