SRH In IPL Final: ఐపీఎల్‌ ఫైనల్లోకి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. ట్రోఫీ కోసం కోల్‌కత్తాతో ఢీ

IPL 2024 Eliminator 2 SRH vs RR: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఫైనల్‌లోకి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అడుగుపెట్టింది. రాజస్థాన్‌ రాయల్స్‌పై విజయంతో ఫైనల్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ను ఢీకొట్టడానికి సిద్ధమైంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : May 25, 2024, 12:27 AM IST
SRH In IPL Final: ఐపీఎల్‌ ఫైనల్లోకి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. ట్రోఫీ కోసం కోల్‌కత్తాతో ఢీ

SRH vs RR Highlights: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ట్రోఫీ అందుకునేందుకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరో అడుగుదూరంలో నిలిచింది. చెన్నై వేదికగా శుక్రవారం జరిగిన ఎలిమినేటర్‌ 2 మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌పై నెగ్గి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. రసవత్తరంగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ను 36 పరుగుల తేడాతో హైదరాబాద్‌ విజయం సాధించింది. ఆల్‌ రౌండ్‌ ప్రదర్శనతో సత్తా చాటుతూ వస్తున్న సన్‌రైజర్స్‌ మూడోసారి ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. ఆదివారం కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌తో ట్రోఫీ కోసం తలపడనుంది.|

Also Read: SRH vs RR Highlights: ఫైనల్లోకి సన్‌రైజర్స్‌.. కావ్య మారన్‌ సంబరాలు మామూలుగా లేవు

 

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 9 వికెట్లు కోల్పోయి అతికష్టంగా 175 పరుగులు చేసింది. మరోసారి టాపార్డర్‌ విఫలమైన వేళ హెన్రిచ్‌ క్లాసెన్‌ సత్తా చాటాడు. వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టుకు ఊరటనిచ్చేలా విలువైన ఇన్నింగ్స్‌ ఆడాడు. 34 బంతుల్లో 50 పరుగులు చేశాడు. వరుసగా డకౌట్‌లతో వెనుదిరుగుతున్న ట్రావిస్‌ హెడ్‌ ఈ మ్యాచ్‌లో తన ఫామ్‌ కొనసాగించాడు. నిలకడైన ప్రదర్శనతో 28 బంతుల్లో 34 స్కోర్‌ చేశాడు. అభిషేశ్‌ శర్మ (12) కొద్ది పరుగులకే ఔటైన వేళ బ్యాటింగ్‌కు దిగిన రాహుల్‌ త్రిపాఠి దూకుడుతో బ్యాటింగ్‌ ఆడాడు. పవర్‌ ప్లేలో వరుస ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోయి ఆడాడు. 15 బంతుల్లో 37 పరుగులు చేశాడు. ఆఖరులో షాబాజ్‌ అహ్మద్‌ 18 పరుగులతో విలువైన ఇన్నింగ్స్‌ ఆడాడు.

Also Read: IPL Eliminator 1 RR vs RCB: బెంగళూరు దురదృష్టం మళ్లీ చెదిరిన ఐపీఎల్‌ ట్రోఫీ కల.. రాజస్థాన్‌ విజయం

 

బౌలింగ్‌ విషయానికి వస్తే రాజస్థాన్‌ మ్యాచ్‌ ఆరంభంలో అద్భుతంగా బౌలింగ్‌ వేసి వికెట్లు తీసినా పరుగులకు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోయింది. పవర్‌ ప్లేలో అనూహ్యంగా ట్రెంట్‌ బౌల్ట్‌తో మూడు ఓవర్లు వేసి మూడు వికెట్లు తీశాడు. సన్‌రైజర్స్‌ టాప్‌ బ్యాటర్లు అభిషేక్‌ శర్మ, రాహుల్‌ త్రిపాఠి, ఐడెన్‌ మర్‌క్రమ్‌లను బౌల్ట్‌ ఔట్‌ చేశాడు. ఆవేశ్‌ ఖాన్‌ అద్భుతమైన బౌలింగ్‌తో మూడు వికెట్లు తీయగా.. సందీప్‌ శర్మ రెండు తీసి సన్‌రైజర్స్‌ను 200 మైలురాయిని దాటనీయలేదు.

మోస్తరు స్కోర్‌ లక్ష్యాన్ని రాజస్థాన్‌ రాయల్స్‌ ఛేదించలేకపోయింది. 7 వికెట్ల నష్టానికి ఓవర్లు పూర్తయ్యేసరికి రాజస్థాన్‌ 139 పరుగులు మాత్రమే చేసింది. నామమాత్ర లక్ష్యాన్ని బ్యాటర్లు ఛేదించలేక మ్యాచ్‌ను చేజార్చుకున్నారు. టాపార్డర్‌ విఫలమైన వేళ ధ్రువ్‌ జురేల్‌ అద్భుతంగా పోరాడాడు. 35 బంతుల్లో 56 పరుగులు చేసి ఈ సీజన్‌లో రెండో అర్ధ శతకం నమోదు చేశాడు. టామ్‌ కోహ్లెర్‌ (10), కెప్టెన్‌ సంజూ శామ్‌న్‌ (10), రియాన్‌ పరాగ్‌ (6) అతి తక్కువ స్కోర్‌ చేయగా.. యశస్వీ జైస్వాల్‌ 21 బంతుల్లో 42 స్కోర్‌తో న్యాయం చేశాడు. అప్పటికే జట్టు కష్టాల్లో ఉండగా రవిచంద్రన్‌ అశ్విన్‌ డకౌట్‌ కాగా.. హెట్‌మెయిర్‌ 4, రవూమన్‌ పావెల్‌ 6 పరుగులే చేయడంతో జట్టు ఓటమి వైపు నిలబడింది.

చావోరేవో లాంటి మ్యాచ్‌లో మోస్తర్‌ స్కోర్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలర్లు కాపాడారు. ట్రోఫీని సాధించడమే లక్ష్యంగా రాజస్థాన్‌ను మట్టికరిపించారు. షాబాద్‌ అహ్మద్‌ గొప్పగా బౌలింగ్‌ చేసి మూడు వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌తో దూకుడుగా ఆడిన అభిషేక్‌ శర్మ బౌలింగ్‌లోనూ సత్తా చాటి 2 వికెట్లు పడగొట్టాడు. కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌, నటరాజన్‌ చెరొక వికెట్‌ తీసి జట్టు విజయంలో భాగమయ్యారు. ఓటమితో రాజస్థాన్‌ ఐపీఎల్‌ నుంచి వైదొలగగా విజయంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ముందడుగు వేసింది. మే 26వ తేదీన ఆదివారం జరగనున్న ఫైనల్‌లో హైదరాబాద్‌ కోల్‌కత్తాను ఢీకొట్టనున్నది.

ముఖ్య విశేషాలు

  • ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫైనల్‌ చేరడం ఇది మూడోసారి. 2016లో చాంపియన్‌గా నిలిచింది. 2018లో రన్నరప్‌గా నిలిచింది.
  • తొలి క్వాలిఫయర్‌లో తనను ఓడించిన కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌తో ఫైనల్‌లో హైదరాబాద్‌ తలపడనుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News