విరాట్ కోహ్లీ, సచిన్, గవాస్కర్ రికార్డును అధిగమించిన స్టీవ్ స్మిత్

టెస్ట్ కెరీర్‌లో స్టీవ్ స్మిత్‌కు ఇది 24వ సెంచరీ కాగా 118 ఇన్నింగ్స్‌లలోనే స్మిత్ ఈ రికార్డ్ సొంతం చేసుకోవడం విశేషం.

Last Updated : Aug 3, 2019, 12:02 PM IST
విరాట్ కోహ్లీ, సచిన్, గవాస్కర్ రికార్డును అధిగమించిన స్టీవ్ స్మిత్

బర్మింగ్‌హామ్: బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకుని ఏడాదిపాటు నిషేధానికి గురైన ప్రముఖ ఆస్ట్రేలియన్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ తిరిగి తన రీఎంట్రీతో ఆడిన మ్యాచ్‌లోనే ఇరగదీశాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో గురువారం ప్రారంభమైన యాషెస్ టెస్టులో స్టీవ్ స్మిత్ సెంచరీ (144) పరుగులు చేశాడు. టెస్ట్ కెరీర్‌లో స్టీవ్ స్మిత్‌కు ఇది 24వ సెంచరీ కాగా 118 ఇన్నింగ్స్‌లలోనే స్మిత్ ఈ రికార్డ్ సొంతం చేసుకోవడం విశేషం. దీంతో అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా స్మిత్ రికార్డ్ సొంతం చేసుకున్నాడు. 

66 ఇన్నింగ్స్‌లలోనే 24 సెంచరీలు కొట్టిన ఆసిస్ క్రికెట్ లెజెండ్ డాన్ బ్రాడ్‌మన్ తర్వాత రెండో ఆటగాడిగా పేరు సొంతం చేసుకున్న స్మిత్.. ఇప్పటివరకు డాన్ బ్రాడ్‌మన్ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్న ముగ్గురు భారతీయ క్రికెటర్స్ అయిన విరాట్ కోహ్లీ(123 ఇన్నింగ్స్), సచిన్ టెండూల్కర్‌ (125 ఇన్నింగ్స్), సునిల్ గవాస్కర్ (128 ఇన్నింగ్స్) రికార్డులను వెనక్కి నెట్టేశాడు. 

Trending News