SRH vs RCB: పీకల్లోతు కష్టాల్లో ఆర్బీబీ జట్టు...వికెట్లు కోల్పోతున్న ఆర్సీబీ

నువ్వా నేనా సమరం మొదలైంది. బరిలో మిగిలేది ఎవరో తెల్చుకునే సమరం ప్రారంభమైంది. టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఫీల్డింగ్ ఎంచుకుంది.  మూడేళ్ల తరువాత నాకౌట్ కు చేరుకున్న బెంగుళూరు విజేతగా నిలుస్తుందా లేదా మరి..

Last Updated : Nov 6, 2020, 09:13 PM IST
SRH vs RCB: పీకల్లోతు కష్టాల్లో ఆర్బీబీ జట్టు...వికెట్లు కోల్పోతున్న ఆర్సీబీ

నువ్వా నేనా సమరం మొదలైంది. బరిలో మిగిలేది ఎవరో తెల్చుకునే సమరం ప్రారంభమైంది. టాస్ గెలిచిన సన్ రైజర్స్ ( Sunrisers Hyderabad ) ఫీల్డింగ్ ఎంచుకుంది.  మూడేళ్ల తరువాత నాకౌట్ కు చేరుకున్న బెంగుళూరు విజేతగా నిలుస్తుందా లేదా మరి..

నువ్వా నేనా మ్యాచ్ లో ...టైటిల్ సాధించాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో ఆర్సీబీ ( Royal Challengers Bengaluru ) కష్టాల్లో పడింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన ఆర్సీబీ జట్టు ప్రారంభంలోనే తొలి వికెట్ ను కెప్టెన్ విరాట్ కోహ్లీ ( Virat kohli ) ను కోల్పోయింది.  ఎలిమినేటర్ మ్యాచ్ కావడంతో రెండు జట్లకు ఇది కీలకం. అటువంటి కీలకమైన మ్యాచ్ లో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ ముందే అవుటవడంతో జట్టు పూర్తిగా నిరాశకు గురైంది. ఈ సీజన్ లో తొలిసారి రెండో స్థానం నుంచి మారి..ఓపెనర్ గా బరిలో దిగాడు. కెప్టెన్ గా తీసుకున్న ఈ నిర్ణయమే అతన్ని ఔట్ చేసినట్టుంది.  7 బంతుల్లో 6 పరుగులు  చేసి పెవిలియన్ కు చేరిపోయాడు. హోల్డర్ బౌలింగ్ లో గోస్వామి క్యాచ్ తీసుకోగా  విరాట్ వెను తిరిగాడు. ప్రారంభంలోనే ఆర్సీబీ 8 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 37 పరుగులు చేసింది.  తరువాత కూడా వికెట్ల పతనం కొనసాగింది. 13 ఓవర్లు  ముగిసేసరికి...నాలుగు వికెట్లు కోల్పోయింది.

RCB 76/4 (12.5)

RCB 99/5 (15.4)

RCB 131/7 (20)

20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి..131 పరుగులతో ఇన్నింగ్స్ ముగించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు. 

 

Trending News