బుమ్రా దెబ్బకి దక్షిణాఫ్రికా విలవిల..!

దక్షిణాఫ్రికా-భారత్‌ రెండో టెస్టు నిజంగానే అనుకోని మలుపులు తిరుగుతోంది.

Last Updated : Jan 15, 2018, 06:30 PM IST
బుమ్రా దెబ్బకి దక్షిణాఫ్రికా విలవిల..!

దక్షిణాఫ్రికా-భారత్‌ రెండో టెస్టు నిజంగానే అనుకోని మలుపులు తిరుగుతోంది. 28 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన దక్షిణాఫ్రికా మూడు పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోవడం గమనార్హం. బుమ్రా వేసిన రెండో ఓవర్లో రెండో బంతికి మార్క్రమ్‌ కేవలం 1 పరుగుకే ఔట్ అవ్వడం విశేషం. అలాగే ఆరో ఓవర్‌ మూడో బంతికీ హషీమ్‌ ఆమ్లా (1; 10 బంతుల్లో) కూడా ఔట్ అయ్యాడు.

దీంతో సఫారీలు మూడు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి ప్రస్తుతం ఇబ్బందుల్లో పడ్డారు. ప్రస్తుతం 6 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా 8/2 స్కోరుతో ఉంది. ఏబీ డివిలియర్స్‌ (5; 2 బంతుల్లో 1×4), డీన్‌ ఎల్గర్‌ (1; 16 బంతుల్లో) బ్యాటింగ్‌ చేస్తున్నారు. ఔటైన ఈ ఇద్దరు బ్యాట్స్‌మన్‌ కూడా తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీలు నమోదు చేయకుండా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. 

Trending News