/telugu/photo-gallery/puri-jagannadh-explains-about-emotional-blockmail-in-puri-musings-pa-180794 Puri Jagannadh: వాళ్లు అమాయకులుగా కన్పించే క్రిమినల్స్..  షాకింగ్ కామెంట్స్ చేసిన పూరీ జగన్నాథ్.. స్టోరీ ఏంటంటే..? Puri Jagannadh: వాళ్లు అమాయకులుగా కన్పించే క్రిమినల్స్.. షాకింగ్ కామెంట్స్ చేసిన పూరీ జగన్నాథ్.. స్టోరీ ఏంటంటే..? 180794

Virat Kohli should give up captaincy in all formats: టీమ్​ ఇండియా టీ20 ఫార్మాట్​ కెప్టెన్సీ బాధ్యతలు రోహిత్ శర్మకు అప్పగించడాన్ని (Shahid Afridi on Rohit Sharma) పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది మంచి నిర్ణయంగా పేర్కొన్నాడు. కోహ్లీ ఇతర ఫార్మాట్లలో కూడా కెప్టెన్సీని (Shahid Afridi on Virat Kohli) వదులుకుని.. బ్యాంటింగ్​పై దృష్టి సారించొచ్చని సూచించాడు. టీమ్​ ఇండియాకు విరాట్​ కోహ్లీ అవసరం చాలా ఉందని అభిప్రాయపడ్డాడు.

ప్రస్తుతం ఇదే విషయమైన బీసీసీఐ కుడా సమాలోచనలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓ వైపు టీమ్ ఇండియా మాజీ కోచ్​ రవి శాస్త్రి (Ravi Shastry on Kohli) కూడా కోహ్లీ అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకునే వీలుందని ప్రకటించాడు. ఈ వార్తల నేపథ్యంలో అఫ్రిది కామెంట్స్​కు ప్రాధాన్యత సంతరించుకుంది.

టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా..

టీ20 వరల్డ్ కప్​ ప్రారంభం కాకముందే.. విరాట్​ కోహ్లీ కెప్టెన్సీ నుంచి టోర్నీ తర్వాత తప్పుకోనున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. ఐపీఎల్​లో సైతం కెప్టెన్సీని వదులుకోనున్నట్లు స్పష్టం చేశాడు.

ఇదిలా ఉండగా ఇటీవల టీ20  వరల్డ్ కప్​ నుంచి లీగ్​ దశలోనే ఇంటి బాట పట్టింది టీమ్​ ఇండియా. దీనితో టీ20 ఫార్మాట్​ జట్టు సారథి బాధ్యతల నుంచి తప్పుకున్నడు విరాట్. ఈ నేపథ్యంలో అతడి స్థానంలో రోహిత్ శర్మకు పగ్గాలు అప్పగించింది బీసీసీఐ.

టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా.. వన్డే, టెస్టు కెప్టెన్​గా కోహ్లీని ఉన్నాడు.

Also read: Sania Mirza Supports Pakistan: సానియా మీర్జా భారత పౌరసత్వాన్ని రద్దు చేయండి.. సోషల్ మీడియాలో ట్రోలింగ్

Also read: Australia Vs Pakistan: ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త బంతి విసిరిన బౌలర్.. వీడియో వైరల్

న్యూజిలాండ్​ సీరీస్​కు కోహ్లీ దూరం..

వరుస మ్యాచ్​లతో ఒత్తిడిలో ఉన్న కోహ్లీకి విశ్రాంతినిచ్చింది బీసీసీఐ. దీనితో ఈ నెల 17 నుంచి న్యూజిలాండ్​తో జరగనున్న టీ20 మ్యాచ్​లకు దూరం (India vs NZ) కానున్నాడు. ఆ తర్వాత జరగనున్న రెండు టెస్ట్​ సిరీస్​లలో.. మొదటి దానికి కూడా దూరంగా ఉండనున్నాడు.

సిరీస్​ ఇలా..

ఇండియా, న్యూజిలాండ్ మధ్య నవంబర్​ 17న మొదటి టీ20 (జైపూర్​), నవంబర్ 19న రెండో టీ 20(రాంచి), నవంబర్ 21న మూడో టీ20 (కోల్​కతా) జరగనుంది.

కాన్పూర్ వేదికగా.. 25-29 మధ్య తొలి టెస్ట్​.. రెండో టెస్ట్ మంబయిలో డిసెంబర్ 3-7 మధ్య జరగనుంది.

ఇదిలా ఉండగా..రోహిత్ శర్మకూ టెస్ట్​ సిరీస్​ నుంచి విశ్రాంతి ఇచ్చింది బీసీసీఐ. దీనితో అజింక్యా రహానే కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు. ఇక వైస్ కెప్టెన్​గా ఛతేశ్వర్‌ పుజారా పేరును ప్రకటించింది బీసీసీఐ. మరోవైపు స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ లకు టెస్టులకు విశ్రాంతినిచ్చింది. మరి ప్రస్తుత పరిస్థితుల్లో కోహ్లీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాలి. 

Also read: Devon Conway Injury: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కు ముందు న్యూజిలాండ్ జట్టుకు షాక్.. కీలక ఆటగాడు దూరం

Also read: India Vs New Zealand Series: న్యూజిలాండ్ తో టెస్టులకు ఇండియన్ టీమ్ ప్రకటన.. రోహిత్, పంత్, షమీకి విశ్రాంతి

కోహ్లీ గురించి రవిశాస్త్రి ఏమన్నాడంటే..

టీమ్​ ఇండియా మాజీ కోచ్​ రవి శాస్త్రి మరో కోహ్లీ కెప్టెన్సీ విషయంలో కోణం బయటపెట్టాడు. విరాట్​  కోహ్లీ స్వయంగా వన్డే, టెస్టు కెప్టెన్సీని వదులుకునే అవకాశముందన్నాడు. బ్యాటింగ్​పై దృష్టి సారించేందుకు కోహ్లీ ఈ నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొన్నాడు. అయితే ఇది ఇప్పట్లో జరగకపోవచ్చని ఇందుకు కొంత సమయం పడుతుందని వివరించాడు.

ఇదిలా ఉంటే.. కోహ్లీని బ్యాటింగ్​పై దృష్టి సారించేలా చేసేందుకు వన్డె కెప్టెన్సీ నుంచి తప్పించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు ఓ నివేదిక పేర్కొంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Also read: Neeraj Chopra: 'నేను మరిన్ని పతకాలు సాధించాలి..తర్వాతే బయోపిక్'..

Also read: Warner Six On Dead Ball: ‘వార్నర్ అలాంటి షాట్ ఆడడం సిగ్గుచేటు’.. గౌతమ్ గంభీర్ ఫైర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Section: 
English Title: 
Should Virat Kohli quit captaincy in all formats? Shahid Afridi says THIS
News Source: 
Home Title: 

Shahid Afridi about Kohli: 'కోహ్లీ కెప్టెన్సీ వదులుకుని బ్యాటర్​గా కొనసాగాలి'

Shahid Afridi about Kohli: కోహ్లీ అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీ  వదులుకుని.. బ్యాటర్​గా కొనసాగాలి'
Caption: 
Virat Kohli (file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

కోహ్లీ కెప్టెన్సీపై పాక్ మాజీ క్రికెటర్ కీలక ప్రకటన

అతడిని బ్యాటర్​గానే కొనసాగించాలని అభిప్రాయం వ్యక్తం

టీమ్ ఇండియాకు కోహ్లీ అవసరం చాలా ఉందని స్పష్టం

Mobile Title: 
Shahid Afridi about Kohli: 'కోహ్లీ కెప్టెన్సీ వదులుకుని బ్యాటర్​గా కొనసాగాలి'
ZH Telugu Desk
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Saturday, November 13, 2021 - 12:47
Request Count: 
75
Is Breaking News: 
No