Shakib Al Hasan Injury: బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్ (Shakib Al Hasan News) టీ20 ప్రపంచకప్ టోర్నీకి దూరమయ్యాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌కు ముందే హసన్‌కు గాయం కావడం బంగ్లా జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లైంది. అయితే.. తొడ కండరాల్లో స్వల్ప చీలిక ఏర్పడిన కారణంగా షకిబ్ టోర్నీకి (T20 World Cup 2021) దూరమైనట్లు తెలుస్తోంది.
"షకిబ్‌కు తొడకండరాల్లో గాయమైంది. ఎలాంటి గాయమనేది స్కానింగ్ రిపోర్ట్స్ వచ్చాక తెలుస్తోంది. ప్రస్తుతం టోర్నీ నుంచి అతడు తప్పుకుంటున్నాడు" అని బంగ్లాదేశ్ క్రికెట్ వర్గాలు తెలిపాయి.
టీ20 ప్రపంచకప్ సూపర్ 12 పోటీల్లో బంగ్లాదేశ్ మూడు మ్యాచ్‌లు ఆడింది. ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించలేదు. అయితే.. గాయం కారణంగా షకిబ్ దూరమవడం బంగ్లా జట్టుకు తీరని లోటు ఏర్పడనుంది. ఇటీవలే ఆ జట్టుకు చెందిన మహమ్మద్ సైఫుద్దీన్ నడుం నొప్పి (Mohammad Saifuddin Injury) కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. అతడి స్థానంలో రుబెల్ (Rubel Hossain News) జట్టులోకి వచ్చాడు. ప్రస్తుతం షకిబ్ స్థానంలో ఎవరు ఆడుతారనేది తెలియాల్సి ఉంది.
Also Read: National Sports Awards: నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్.. విజేతలకు నవంబరు 1న ప్రదానోత్సవం
Also Read: Afghanistan Vs Namibia: సెమీస్ రేసులో నిలిచిన అఫ్గానిస్థాన్.. నమీబియాపై ఘన విజయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook