Shahid Afridi Daughter Marriage: అంగరంగ వైభవంగా షాహిద్ అఫ్రిదీ కూతురు పెళ్లి.. పెళ్లికొడుకు షాహిన్‌ ఆఫ్రిదీ కాదు!

PCB Chief Shahid Afridi elder daughter Aqsa gets Married. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ పెద్ద కుమార్తె అక్సా షాహిద్ ఆఫ్రిదీ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 31, 2022, 01:29 PM IST
  • అంగరంగ వైభవంగా షాహిద్ అఫ్రిదీ కూతురు పెళ్లి
  • పెళ్లికొడుకు షాహిన్‌ ఆఫ్రిదీ కాదు
  • ఫిబ్రవరి 3న పెళ్లికి ముహూర్తం
Shahid Afridi Daughter Marriage: అంగరంగ వైభవంగా షాహిద్ అఫ్రిదీ కూతురు పెళ్లి.. పెళ్లికొడుకు షాహిన్‌ ఆఫ్రిదీ కాదు!

Shahid Afridi elder daughter Aqsa tied the knot with Naseer Nasir Khan: పాకిస్థాన్ మాజీ కెప్టెన్, పీసీబీ చీఫ్‌ సెలక్టర్‌ షాహిద్ అఫ్రిదీ పెద్ద కుమార్తె అక్సా షాహిద్ ఆఫ్రిదీ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. అఫ్రిదీ పెద్ద కుమార్తె అక్సా వివాహం శుక్రవారం (డిసెంబర్ 30) నసీర్ నాసిర్ ఖాన్‌తో జరిగింది. కరాచీలో ఘనంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకి షాహిద్ అఫ్రిదీ బంధువులు, అత్యంత సన్నిహితులు హాజరయ్యారు. ఈ పెళ్లిలో పాకిస్తాన్‌ యువ పేసర్‌ షాహిన్‌ షా ఆఫ్రిదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. 

పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ ఆఫ్రిదీ రెండో కుమార్తె అన్షా ఆఫ్రిదీతో యువ పేసర్ షాహిన్‌ షా ఆఫ్రిదీ పెళ్లి జరుగనున్న విషయం తెలిసిందే. వీరిద్దరి పెళ్లి 2023 ఫిబ్రవరి 3న కరాచీలో జరగనుంది. పెద్ద కూతురు అక్సా పెళ్లి అనంతరమే రెండో కూతురు అన్షాకు పెళ్లి చేయాలని షాహిద్‌ ఆఫ్రిదీ కుటుంబం నిర్ణయించింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 3న పెళ్లికి ముహూర్తం ఖరారు చేశారు. షాహిద్‌ ఆఫ్రిదీకి నలుగురు కూతుళ్లు అన్న విషయం తెలిసిందే. కుమారుడు అందరికంటే చిన్నవాడు. 

అక్సా పెళ్లిలో షాహిద్ అఫ్రిదీ, షాహిన్‌ షా ఆఫ్రిదీ సందడి చేశారు. పాకిస్థాన్ క్రికెటర్స్, పీసీబీ పెద్దలతో సహా బంధువులను దగ్గరుండి మరీ ఆహ్వానించారు. అక్సా వివాహానికి సంబంధించిన వీడియోలు, ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీడియోలో నాసిర్ ఖాన్ 'ఖుబూల్ హై' అని చెప్పడం వినిపిస్తోంది. మరోవైపు షాహిద్ ఆఫ్రిదీ మరియు షాహీన్ షా అఫ్రిదీ కలిసి నసీర్ వెనుక నిలబడి ఉండడం వీడియోలో చూడొచ్చు. 

ప్రస్తుతం పాక్‌ ప్రధాన పేసర్‌గా షాహిన్‌ షా ఆఫ్రిదీ ఉన్నాడు. 2018లో పాక్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన షాహిన్‌.. ఇప్పటివరకు 25 టెస్టులు, 32 వన్డేలు, 47 టీ20లు ఆడాడు. వరుసగా 99, 62, 58 వికెట్స్ పడగొట్టాడు. మరోవైపు షాహిద్ ఆఫ్రిదీ పాక్ తరపున 27 టెస్టులు, 398 వన్డేలు, 99 టీ20లు ఆడాడు. షాహిద్‌ ఇటీవలే పీసీబీ చీఫ్‌ సెలక్టర్‌గా ఎన్నికయ్యాడు. దాంతో మామ, అల్లుడు పాకిస్తాన్‌ క్రికెట్‌లో కీలక సభ్యులుగా ఉన్నారు. 

Also Read: Rishabh Pant Car Accident: మీరు రియల్ హీరో.. పంత్‌ను కాపాడిన బస్ డ్రైవర్‌పై మాజీ లెజెండ్ ప్రశంసలు!  

Also Read: Rishabh Pant Health Update: రిషబ్ పంత్‌ పరిస్థితి విషమం.. విమానంలో ఢిల్లీకి తరలింపు?  

లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News