Fastest ODI Fifty: ఏడో స్థానంలో బ్యాటింగ్‌.. వన్డేల్లో ఫాస్టెస్ట్‌ హాఫ్ సెంచరీ! స్కాట్లాండ్‌ బ్యాటర్ రికార్డు

Scotland player Michael Leask hits Fastest ODI Fifty. వన్డే ప్రపంచకప్‌ 2023 అర్హత పోటీల్లో స్కాట్లాండ్‌ ఆటగాడు మైఖేల్‌ లీస్క్‌ సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. 18 బంతుల్లోనే  6 సిక్సర్ల సాయంతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 14, 2022, 03:50 PM IST
  • ఏడో స్థానంలో బ్యాటింగ్‌
  • వన్డేల్లో ఫాస్టెస్ట్‌ హాఫ్ సెంచరీ
  • స్కాట్లాండ్‌ బ్యాటర్ రికార్డు
Fastest ODI Fifty: ఏడో స్థానంలో బ్యాటింగ్‌.. వన్డేల్లో ఫాస్టెస్ట్‌ హాఫ్ సెంచరీ! స్కాట్లాండ్‌ బ్యాటర్ రికార్డు

Scotland player Michael Leask hits fastest fifty in ODI's: క్రికెట్‌ ఆటలో నిత్యం కొత్త రికార్డులు నమోదవుతూనే ఉంటాయి. బ్యాటర్ దంచికొట్టడం లేదా బౌలర్ వికెట్లు పడగొట్టడంతో పాత రికార్డులు బ్రేక్ అయి కొత్త రికార్డులు నమోదవుతాయి. కొన్ని సార్లు తృటిలో రికార్డులు మిస్ అవుతుంటాయి. తాజాగా అలాంటిదే జరిగినా.. కొత్త రికార్డు మాత్రం నమోదైంది. స్కాట్లాండ్‌ బ్యాటర్ మైఖేల్‌ లీస్క్‌ 18 బంతుల్లోనే 50 పరుగులు చేసి.. వన్డేల్లో ఫాస్టెస్ట్‌ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అయితే ఈ రికార్డు ఐసీసీ అసోసియేట్‌ దేశాల వన్డే క్రికెట్‌లో నమోదైంది. 

వన్డే ప్రపంచకప్‌ 2023 అర్హత పోటీల్లో భాగంగా స్కాట్లాండ్‌, పపువా న్యూ గినియా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ ఆటగాడు మైఖేల్‌ లీస్క్‌ సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. 18 బంతుల్లోనే  6 సిక్సర్ల సాయంతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. ఇన్నింగ్స్‌ ఆఖరి బంతికి 2 పరుగులు సాధించాల్సి ఉండగా.. డబుల్ రన్ తీసి ఐసీసీ అసోసియేట్‌ దేశాల వన్డే క్రికెట్‌లో ఫాస్టెస్ట్‌ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. లీస్క్‌ ఏడో స్థానంలో బరిలోకి దిగి ఈ రికార్డు అందుకోవడం విశేషం. లీస్క్‌ సాధించిన రికార్డును ఐసీసీ తమ అధికారిక ట్విటర్‌లో పేర్కొంది.

అయితే అంతర్జాతీయ వన్డేల్లో వేగవంతమైన హాఫ్‌ సెంచరీ చేసిన రికార్డు దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, మిస్టర్‌ 360 ఏబీ డివిలియర్స్‌ పేరిట ఉంది. డివిలియర్స్‌ 2015లో వెస్టిండీస్‌పై 16 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ బాదాడు. అప్పటినుంచి ఆ రికార్డు డివిలియర్స్‌ పేరుపైనే కొనసాగుతోంది. మైఖేల్‌ లీస్క్‌ మరో రెండు బంతుల ముందుగా హాఫ్ సెంచరీ చేస్తే.. ఏబీతో సమానంగా నిలిచేవాడు. ఇక అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా మాజీ బ్యాటర్ యువరాజ్ సింగ్ 12 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. 

ఈ మ్యాచులో టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. కొయెట్జర్‌ (74), బెర్రింగ్టన్‌ (56), లీస్క్‌ (50 నాటౌట్‌) హాఫ్‌ సెంచరీలతో రాణించారు. లక్ష్య ఛేదనలో స్కాటిష్‌ బౌలర్‌ గావిన్‌ మెయిన్‌ (5/52), హమ్జా తాహిర్‌ (3/27)ల ధాటికి పపువా న్యూ గినియా 36.2 ఓవర్లలో 164 పరుగులకే ఆలౌట్ అయింది. టోనీ ఉరా (47) టాప్‌ స్కోరర్‌. స్కాట్లాండ్‌ 123 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 

Also Read: Rohit Sharma: ముంబై ఇండియన్స్‌కు మరో భారీ షాక్‌.. రోహిత్ శర్మపై వేటు?

Also Read: Dewald Brevis: 'జూనియర్‌ ఏబీ'నా మజాకా.. వ‌రుస‌గా 4 సిక్సులు! ఐపీఎల్‌ 2022లోనే భారీ సిక్సర్‌ (వీడియో)!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News