Sara Tendulkar Pics: వధువుగా మారిన సారా టెండూల్కర్.. బ్రైడల్ లెహంగాలో వావ్ అనిపిస్తున్న సచిన్ తనయ!

Sara Tendulkar tunrs Bride for Vogue magazine Photoshoot. వోగ్ మ్యాగజైన్ కవర్‌ పేజీ కోసం సారా టెండూల్క‌ర్ ఫోటోషూట్ చేశారు. ఇందుకోసం బ్రైడల్ లెహంగాలో దర్శమిచ్చారు.  

Written by - P Sampath Kumar | Last Updated : Jul 28, 2022, 03:51 PM IST
  • థాయ్‌లాండ్ వెకేషన్‌లో సారా టెండూల్క‌ర్
  • వధువుగా మారిన సారా
  • బ్రైడల్ లెహంగాలో సచిన్ తనయ
Sara Tendulkar Pics: వధువుగా మారిన సారా టెండూల్కర్.. బ్రైడల్ లెహంగాలో వావ్ అనిపిస్తున్న సచిన్ తనయ!

Sara Tendulkar tunrs Bride for Vogue magazines cover page: సారా టెండూల్క‌ర్.. ఈ పేరుకు ప్రత్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర‌లేదు. క్రికెట్ దిగ్గజం స‌చిన్ టెండూల్క‌ర్ కూతురిగా ఈ ప్ర‌పంచానికి పరిచయం అయినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 

సారా టెండూల్క‌ర్ త‌న అందం, అభినయంతో కుర్రాళ్ల మ‌న‌స్సును దోచేశారు. ఆమెకు సోషల్ మీడియాలో ఫాన్స్ ఫాలోయింగ్ మాములుగా లేదు. హీరోయిన్‌కు మించిన అందం ఉన్న సారా ఒక్క ఫోటో పెట్టిందంటే లక్షల్లో లైకులు, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది. 

తల్లి అంజలి టెండూల్కర్ బాటలో నడుస్తూ సారా లండన్‌లో మెడిసిన్ చదివారు. ఇటీవల ఎంబీబీఎస్ పూర్తిచేసిన సారా.. సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటున్నారు. తనకు సంబందించిన పోటోలను ఎప్పటికప్పుడూ షేర్‌ చేస్తూ అభిమానులకు టచ్‌లో ఉంటారు. 

సారా టెండూల్కర్ ఎప్పుడూ ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీస్, వెకేషన్‌ అంటూ తెగ ఎంజాయ్ చేస్తారు. ఆ ఫొటోస్ తన సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేసి అభిమానులకు కనువిందు చేస్తారు. 

సారా టెండూల్క‌ర్ థాయ్‌లాండ్‌లో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లిన ఆమె.. బీచ్, రిసార్ట్‌లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

సారా టెండూల్క‌ర్ తాజాగా వధువుగా మారారు. వోగ్ మ్యాగజైన్ కవర్‌ పేజీ కోసం సారా ఫోటోషూట్ చేశారు. ఇందుకోసం బ్రైడల్ లెహంగాలో దర్శమిచ్చారు. ఈ ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

Also Read: సీఏపీఎఫ్‌లో 84,405 ఖాళీ పోస్టులు భర్తీ.. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి!

Also Read: ఇదేందయ్యో ఇది.. పెట్రోల్ తక్కువగా ఉందని చలాన్ చేసిన ట్రాఫిక్ పోలీసులు!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News