Sachin Tendulkar Sacrificed for Virender Sehwag: ఇండియన్ క్రికెట్‌లో ( Indian Cricket ) బెస్ట్ ఓపెనింగ్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది వీరేంద్ర సెహ్వాగ్ ( Virender Sehwag ), సచిన్ టెండూల్కర్ జోడి. సచిన్, సెహ్వాగ్ ఓపెనింగ్‌లో బ్యాటింగ్‌కు దిగే ముందు సౌరవ్ గంగూలి ( Sourav Ganguly ), సచిన్ జోడి టాప్‌లో ఉండేది. అయితే తరువాత సెహ్వాగ్ గంగూలి స్థానాన్ని భర్తీ చేశాడు. అయితే వీరూ కోసం సచిన్ తన ఓపెనింగ్ ఆర్డర్ను త్యాగం చేసిన విషయాన్ని మాజీ వికెట్ కీపర్ అజయ్ రాత్రా వెల్లడించారు. India Vs China: ఆ ప్రాంతం నుంచి వెనక్కి తగ్గం అంటున్న చైనా
2001లో న్యూజిలాండ్‌తో ( New Zealand ) జరిగిన వన్డేలో సెహ్వాగ్‌ను ఓపెనింగ్ బ్యాటింగ్ చేసే అవకాశం ఇస్తూ సచిన్ నాలుగవ స్థానంలో దిగాడు. దాంతో గంగూలీ, సెహ్వాగ్ ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేయడం ప్రారంభించారు. అది పూర్తిగా సచిన్ ( Sachin Tendulkar ) నిర్ణయం అని.. టీమ్ ఇండియా ప్రయోజనం కోసం సచిన్ తనకు బాగా కలిసి వచ్చిన ఓపెనింగ్ బ్యాటింగ్ ఆర్డర్ను త్యాగం చేసినట్టు రాత్రా ( Ajay Ratra ) తెలిపాడు. ఆరోజు సచిన్ చేసిన త్యాగం వల్లే సెహ్వాన్ ఓపెనింగ్ ( Sehwag As Opening Batsman ) బ్యాట్స్‌మెన్‌గా రాణించాడు అని లేదంటే ఆ అవకాశమే వచ్చేది కాదన్నాడు.
వీరేంద్ర సెహ్వాగ్ ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు దిగి 54 బంతుల్లో 33 పరుగులు చేశాడు. అయితే రెండు మ్యాచుల తరువాత అతను సెంచరీ చేశాడు. అందుకోసం సచిన్ లోయర్ ( Lower Order ) ఆర్డర్‌లో వచ్చి మ్యాచ్ చివరి వరకు ఆడేందుకు ఒప్పుకున్నాడు. దాంతో మెల్లిమెల్లిగా ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా సెహ్వాగ్ ఫిక్స్ అయిపోయాడు. ఓపెనర్‌గా వీరేంద్ర సెహ్వాగ్ 7518 పరుగులు చేశాడు.
Read : Nagnam Sweety Facts: నగ్నం స్వీటీ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు