Ruturaj Gaikwad To Captain CSK In IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రాబోయే సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కు కొత్త కెప్టెన్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత కెప్టెన్ ఎంఎస్ ధోనీ పూర్తిగా కోలుకోకపోతే.. రుతురాజ్ గైక్వాడ్‌కు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించనున్నారు. రవీంద్ర జడేజా 2022 ఎడిషన్‌లో 7 మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేపట్టగా.. జట్టు దారుణంగా విఫలమైంది. దీంతో ధోనీ మళ్లీ కెప్టెన్సీ చేపట్టాడు. ఈ ఏడాది జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. వచ్చే ఐపీఎల్ ఆడేందుకు ధోనీ సుముఖంగా ఉన్నా.. ఫిట్‌నెస్‌పై ఆందోళన నెలకొంది. చెన్నై జట్టు టైటిల్ గెలిచిన అనంతరం ధోనీ మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం పూర్తిగా కోలుకోవడంపై దృష్టిపెట్టాడు. ఇటీవల మెట్లు దిగేందుకు కూడా ధోనీ ఇబ్బందిపడిన వీడియో నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే. 42 ఏళ్ల ధోని ప్రస్తుతం తన రిటైర్మెంట్ లైఫ్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవల భార్య సాక్షితో కలిసి విహారయాత్రకు వెళ్లాడు.
చైన్నైను ఐదోసారి ఛాంపియన్‌గా నిలిపిన వెంటనే ధోనీ రిటైర్‌మెంట్ ప్రకటిస్తారని అభిమానులు అందరూ ఊహించారు. ధోనీ మార్క్‌తో జట్టు విజేతగా నిలవడంతో ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పేందుకు ఇంతకంటే మంచి ఉండదని అనుకున్నారు. ధోనీ కూడా అదే చెప్పాడు. రిటైర్‌మెంట్ ప్రకటించేందుకు ఇదే మంచి సమయం అని.. కానీ అభిమానులు ఉత్సాహం చూస్తుంటే ఇంకా క్రికెట్ ఆడాలని ఉందన్నాడు. ఫిట్‌నెస్‌తో ఉంటే వచ్చే సీజన్‌లో కూడా ఆడతానని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పాడు. ఐపీఎల్‌కు ఇంకా టైమ్ ఉండడంతో ఆలోపు ధోనీ పూర్తి ఫిట్‌నెస్‌తో బరిలోకి దిగుతాడని అభిమానులు అనుకుంటున్నారు.
ఇటీవల ఏషియన్ గేమ్స్‌లో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించిన రుతురాజ్ గైక్వాడ్.. జట్టుకు గోల్డ్ మెడల్ అందించాడు. ప్రస్తుతం ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు కూడా వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. చెన్నై జట్టు పగ్గాలు చేపట్టేందుకు కూడా రెడీ ఉన్నాడు. టీమ్ ప్లేయర్‌గా సూపర్ ఆడుతున్న రవీంద్ర జడేజా.. మళ్లీ కెప్టెన్సీ జోలికి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఆ ఒత్తిడి జడ్డూ ఆటతీరుపై కూడా ప్రభావం చూపించింది. ఆటగాడిగా.. కెప్టెన్‌గా విఫలమయ్యాడు. ధోనీ మార్గనిర్దేశంలో మంచి బ్యాట్స్‌మెన్‌గా ఎదిగిన రుతురాజ్.. భవిష్యత్‌లో టీమిండియా ఓపెనర్‌గా బెర్త్ ఫిక్స్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంది.
Also Read: CM Jagan Mohan Reddy: 10,511 జంటలకు రూ.81.64 కోట్ల లబ్ధి.. అకౌంట్‌లోకి డబ్బులు జమ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook