RR vs LSG: లక్నో సూపర్ జెయింట్స్‌పై ఆర్ఆర్ విజయం, ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు

RR vs LSG: ఐపీఎల్ 2022లో ఇక ప్లే ఆఫ్ దశ వచ్చేస్తోంది. లక్నో సూపర్ జెయంట్స్‌పై విజయంతో రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్ బర్త్ ఖరాలు చేసుకుంది. ప్లే ఆఫ్ కు చేరిన రెండవ టీమ్‌గా నిలిచింది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 16, 2022, 06:24 AM IST
  • ఐపీఎల్ 2022లో రెండవ ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు చేసుకున్న రాజస్థాన్ రాయల్స్
  • లక్నో సూపర్ జెయింట్స్ జట్టుపై 24 పరుగుల తేడాతో రాజస్థాన్ విజయం
  • ప్లే ఆఫ్ 3, 4 స్థానాల కోసం ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ మధ్య తీవ్రంగా పోటీ
RR vs LSG: లక్నో సూపర్ జెయింట్స్‌పై ఆర్ఆర్ విజయం, ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు

RR vs LSG: ఐపీఎల్ 2022లో ఇక ప్లే ఆఫ్ దశ వచ్చేస్తోంది. లక్నో సూపర్ జెయంట్స్‌పై విజయంతో రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్ బర్త్ ఖరాలు చేసుకుంది. ప్లే ఆఫ్ కు చేరిన రెండవ టీమ్‌గా నిలిచింది. 

ఐపీఎల్  2022లో ఆదివారం రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. లక్నో సూపర్ జెయింట్స్‌పై రాజస్థాన్ రాయల్స్ జట్టు 24 పరుగుల తేడాతో విజయం సాధించి..ప్లే ఆఫ్ బర్త్ ఖరారు చేసుకుంది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ నుంచి ఓపెనర్ యశస్వి జైశ్వాల్ 29 బంతుల్లో 41 పరుగులు చేయగా, సంజూ శాంసన్ 24 బంతుల్లో 32 పరుగులు, పడిక్కన్ 18 బంతుల్లో 39 పరుగులు చేశారు.

ఇక ఆ తరువాత 179 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. మూడవ ఓవర్‌లోనే ట్రెంట్ బౌలింగ్‌లో డికాక్ 7 పరుగులకు వెనుదిరిగాడు. అదే ఓవర్ రెండవ బంతికి బదౌని అవుటయ్యాడు. ఆ తరువాత కెప్టెన్ రాహుల్ కూడా కేవలం 10 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇలా 29 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత కృనాల్ పాండ్యా దీపక్ హుడాలు కాస్త ఇన్నింగ్స్ కోలుకునేలా చేసారు. 13 ఓవర్ల వరకూ ఇన్నింగ్స్ నిలబెట్టారు. చివర్లో హుడా ధాటిగా ఆడుతున్న తరుణంలో చాహల్ అద్భుతంగా బౌల్ చేసి..స్టంప్ అవుట్ చేశాడు.చివర్లో 2 ఓవర్లలో 48 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. స్టోయినిస్ కాస్సేపు ప్రయత్నించి విఫలమయ్యాడు. 24 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 

లక్నోపై విజయంతో 16 పాయింట్లతో రెండవ స్థానానికి చేరుకున్న రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్ బర్త్ ఖరారు చేసుకుంది. అటు లక్నో సూపర్ జెయింట్స్, ఇటు రాజస్థాన్ రాయల్స్ రెండు జట్లూ 13 మ్యాచ్‌లలో 8 విజయాలు సాధించి చెరో 16 పాయింట్లు దక్కించుకున్నాయి. కానీ ఆర్ఆర్ జట్టు రన్‌రేట్..లక్నోతో పోలిస్తే మెరుగ్గా ఉంది. అందుకే పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో నిలిచి ప్లే ఆఫ్ బర్త్ ఖరారు చేసుకుంది. ఇక నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచిన ఆర్సీబీ, ఢిల్లీ కేపిటల్స్‌లలో ఏదో ఒక జట్టు ప్లే ఆఫ్ చేరనుంది. ఎందుకంటే ఈ 14 పాయింట్లతో ఉన్న ఆర్సీబీకు ఒక మ్యాచ్ మిగిలితే..12 పాయింట్లున్న ఢిల్లీకు రెండు మ్యాచ్‌లు మిగిలున్నాయి. 

Also read: CSK vs GT: వృద్ధిమాన్ సాహా సూపర్ షో.. చెన్నైపై గుజరాత్ ఘన విజయం! 20 పాయింట్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News