బెంగుళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కింగ్స్ ఎల్‌వన్ పంజాబ్ జట్టుపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ 19.2 ఓవర్లకు 155 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. దీంతో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని బెంగుళూరు బ్యాట్స్‌మెన్స్ సునాయసంగానే ఛేదించడంతో ఊహించినట్టుగానే విజయం రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు వశమైంది. లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ కి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు.. 19.3 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుని ఓడించింది.
We celebrated our first victory of #VIVOIPL2018 and it was fitting that it in our first home game! A big shout-out to the Bold performances from the entire unit 💪😎#PlayBold #RCBvKXIP #RCB pic.twitter.com/p0DcC3IERj
— Royal Challengers (@RCBTweets) April 13, 2018
కింగ్స్‌ఎల్‌వన్ పంజాబ్ ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ 47, రవిచంద్ర అశ్విన్ 33, కేకే నాయర్ 29, మయంక్ అగర్వాల్ 15, స్టోనిస్ 11, యువరాజ్ సింగ్ 4 పరుగులు చేయగా.. బెంగళూరు బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 3, సుందర్, వోక్స్ చెరో రెండు వికెట్లు, చాహల్ ఒక వికెట్ తీసుకున్నారు.