Rishabh Pant: ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర.. రిషబ్‌ పంత్‌కు కోట్లాభిషేకం

Rishabh Pant Emerged Most Expensive Player With Price Rs 27 Crore: ఐపీఎల్‌ మెగా వేలం అత్యంత ఉత్కంఠగా కొనసాగుతోంది. ఆటగాళ్లను కొనేందుకు జట్లు కోట్లు కుమ్మరిస్తూ వేలాన్ని ఎక్కడికో తీసుకెళ్తున్నాయి. ఈ క్రమంలోనే రిషబ్‌ పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌ల వేలం సంచలనం రేపింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Nov 24, 2024, 05:11 PM IST
Rishabh Pant: ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర.. రిషబ్‌ పంత్‌కు కోట్లాభిషేకం

Rishabh Pant Auction: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2025 మెగా వేలంలో కళ్లు చెదిరేలా వేలం పాట కొనసాగుతోంది. ప్రతిభ గల ఆటగాడిని వలలో వేసుకునేందుకు ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించేందుకు ఏమాత్రం వెనుకాడడం లేదు. ఐపీఎల్‌ చరిత్రలోనే కనీవినీ ఎరుగని లేకుండా ప్లేయర్లు హాట్‌ కేకుల్లా అమ్ముడవుతున్నారు. అప్పటికే ఒక ఆటగాడు చరిత్రలో ఎరుగని ధర పలకగా.. కొన్ని నిమిషాల్లో మరో ఆటగాడు దాన్ని మించిన ధర పలికాడు. అతడే రిషబ్‌ పంత్‌. మెగావేలంలో ఆర్‌టీఎం కార్డు వినియోగంతో వేలాన్ని మరింత ఉత్కంఠ రేకెత్తించింది.
ఇది చదవండి: IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 వేలంలో రికార్డ్ ధర 26.75 కోట్లు పలికిన శ్రేయస్

ఘోర రోడ్డు ప్రమాదం నుంచి కోలుకుని బ్యాటర్‌గా నిలదొక్కుకున్న రిషబ్‌ పంత్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. టెస్టు, వన్డేలు, టీ20లో పంత్‌ 2.0 లాగా కనిపిస్తున్నాడు. గత సీజన్‌లోనే రీఎంట్రీ ఇచ్చిన రిషబ్‌ పంత్‌ మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో కొనసాగిన పంత్‌ ఇప్పుడు రిటైన్‌ కాకుండా వేలంలోకి వచ్చాడు. తన సత్తా ఏమిటో చూపిద్దామని వేలంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. తన క్యాప్టెన్ ను తిరిగి దక్కించుకోవాలని చూడగా ఢిల్లీ క్యాపిటల్స్ కు భారీ షాక్ తగిలింది.
ఇది చదవండి: Kavya Maran: ఐపీఎల్‌ వేలంలో కావ్య మారన్‌కు భారీ షాక్‌.. శాపంగా మారిన ఆర్‌టీఎం కార్డు

శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, రిషబ్‌ పంత్‌ అత్యధిక ధర పొందుతారని వేలానికి ముందు చర్చ జరిగింది. అనుకున్నట్టుగానే శ్రేయస్‌ అయ్యర్‌ కనీస ధర రూ.2 కోట్ల నుంచి రూ.26.75 కోట్లు పలికాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ దక్కించుకోగా పంజాబ్‌ కింగ్స్‌ ఆర్‌టీఎం కార్డు వినియోగించడంతో ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర పలికాడు. అతడితే భారీ ధర అనుకుంటే తానే ఏమీ తక్కువ కాదని రిషబ్‌ పంత్‌ రూ.27 కోట్ల ధర పలికాడు.

క్రికెట్‌ ప్రియులు ఎంతో ఆసక్తిగా రిషబ్ పంత్ వేలం కోసం ఎదురుచూశారు. వేలంలోకి రాగానే అందరూ కేకలు వేశారు. మొదట లక్నో, ఆర్‌సీబీ జట్లు పోటాపోటీగా బిడ్‌ వేశాయి. వెంటవెంటనే ధర పెరుగుతూ వచ్చింది. ఎస్‌ఆర్‌హెచ్ మధ్యలో వచ్చి వెళ్లిపోగా లక్నో సూపర్‌ జెయింట్స్‌ వెనక్కి తగ్గలేదు. ఆఖరకు రూ.20.75 కోట్లకు లక్నో వేలంలో దక్కించుకుంది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్‌ పంత్‌ను మళ్లీ తీసుకునేందుకు ఆర్‌టీఏం కార్డు ఉపయోగించింది. అయితే లక్నో మాత్రం సంచలన నిర్ణయం తీసుకుంది. రూ.27 కోట్లకు భారీ ధర ప్రకటించింది. ఖంగుతిన్న ఢిల్లీ అంత ఇచ్చుకోలేకపోమని చేతులెత్తేయడంతో రిషబ్‌ పంత్‌ లక్నో సూపర్‌ జెయింట్స్‌కు రూ.27 కోట్లకు దక్కాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News