Rishabh Pant Car Accident: టీమిండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ శుక్రవారం ఉదయం కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ హాస్పిటల్‌లో చేరాడు. రూర్కీ సమీపంలో పంత్ కారు రోడ్డు డివైడర్‌ను ఢీకొని దగ్ధమైంది. ప్రమాదం జరిగిన తర్వాత పంత్‌ను సమీపంలోని ఓ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ పంత్‌తో డాక్టర్ సుశీల్ నగర్ మాట్లాడాడు. అక్కడ ఆయన ప్రాథమిక చికిత్స అనంతరం డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆస్పత్రికి రిఫర్ చేశారు.
పంత్ తలకు, మోకాళ్లకు గాయాలయ్యాయని డాక్టర్ సుశీల్ నగర్ తెలిపారు. అయితే గాయం తీవ్రత ఎంతన్నది స్కానింగ్ తర్వాతే తేలనుందన్నారు. పంత్‌ను ఆసుపత్రికి తీసుకువచ్చినప్పుడు స్పృహలోనే ఉన్నాడని తెలిపారు. తనతో పంత్ మాట్లాడాడని చెప్పారు. రూర్కీలోని తన ఇంటికి చేరుకుని.. పంత్ తన తల్లిని ఆశ్చర్యపర్చాలని అనుకున్నాడని ఆయన అన్నారు. అందుకే స్వయంగా కారు నడుపుతూ ఢిల్లీ నుంచి రూర్కీకి వెళ్తున్నాడని తెలిపారు.
'పంత్ తలకు గాయమైంది. కానీ నేను అతనికి కుట్లులేదు. అతని పరిస్థితి చూసి వెంటనే మాక్స్ హాస్పిటల్ కి తీసుకెళ్లమని సూచించాను. పంత్ ఎక్స్‌రేలో ఎముక విరగలేదని తేలింది. మోకాలికి గాయం అయితే ఎంత తీవ్రంగా ఉందో.. ఎంఆర్‌ఐ పరీక్ష ద్వారా తెలుస్తుంది. పంత్ వీపుపై గాయం మంటల వల్ల కాదు. ప్రమాదం జరిగిన తర్వాత కిటికీలోంచి దూకిన సమయంలో తగిలిన గాయమే. తీవ్రమైన వెన్ను గాయం లేదు. మాక్స్ హాస్పిటల్‌లోని ఎముకల నిపుణులు, ప్లాస్టిక్ సర్జన్ల బృందం పంత్ గాయాన్ని పరిశీలిస్తోంది..' అని ఆయన తెలిపారు.
కారు ప్రమాదానికి గురయ్యే సమయంలో పంత్ స్వయంగా కారు నడుపుకుంటు వస్తున్నాడు. తెల్లవారుజాము సమయం కావడంతో కాస్త కళ్లు మూయడంతో రెప్పపాటులో బ్యాలెన్స్ తప్పింది. దీంతో కారు రైలింగ్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. పంత్ కారు అద్దాలు పగలగొట్టి బయటకు దూకేశాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. కారులో పంత్ అలానే ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు చెబుతున్నారు. పంత్ త్వరగా కోలుకోవాలని క్రికెటర్లు, అభిమానులు సోషల్ మీడియాలో వేదికగా కోరుకుంటున్నారు.
Also Read: SSC Exams: పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల.. పూర్తి టైమ్ టేబుల్ ఇదే..
Also Read: Rishabh Pant Car Accident: రిషబ్ పంత్ కారు యాక్సిడెంట్ వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Rishabh Pant Health: తల్లికి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామనే ఉత్సాహం.. అంతలోనే పంత్‌కు ఇలా..