RCB vs KXIP match, IPL 2020: రెచ్చిపోయిన క్రిస్ గేల్, రాహుల్.. కోహ్లీ సేనపై పంజాబ్ విజయం

RCB vs KXIP match: షార్జా:  ఐపీఎల్ 2020 లో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ( Kings XI Punjab ) ఎట్టకేలకు గురువారం రాత్రి షార్జా స్టేడియంలో జరిగిన 31వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ( Royal Challengers Bangalore ) గెలిచి రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది.

Last Updated : Oct 16, 2020, 01:15 AM IST
RCB vs KXIP match, IPL 2020: రెచ్చిపోయిన క్రిస్ గేల్, రాహుల్.. కోహ్లీ సేనపై పంజాబ్ విజయం

RCB vs KXIP match: షార్జా:  ఐపీఎల్ 2020 లో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ( Kings XI Punjab ) ఎట్టకేలకు గురువారం రాత్రి షార్జా స్టేడియంలో జరిగిన 31వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ( Royal Challengers Bangalore ) గెలిచి రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌‌కి విజయం కూడా అంత ఈజీగా రాలేదు. చివరి బంతి వరకు ఇరు జట్ల మధ్య రసవత్తరమైన పోరు నడిచింది. విజయం ఎవరిని వరిస్తుందా అన్నట్టుగా ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో అంతిమంగా పంజాబ్ జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విజయానికి ఒక్క పరుగు దూరంలో ఉండగా చివరి బంతికి నికోలస్‌ పూరన్‌ ( Nicholas Pooran ) (6) సిక్సర్‌‌తో మ్యాచ్ విన్నింగ్ షాట్ బాది పంజాబ్‌కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. Also read : Steve Smith about DC bowlers: ఢిల్లీ బౌలర్ల ధాటికి తట్టుకోలేకపోయాం: స్టీవ్ స్మిత్

పంజాబ్ ఆటగాళ్లలో ఓపెనర్, కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ( KL Rahul 61 నాటౌట్:‌ 49 బంతుల్లో 1 ఫోర్ 5 సిక్సర్లు ), క్రిస్‌గేల్‌ ( Chris Gayle 53 పరుగులు: 45 బంతుల్లో  1ఫోర్‌, 5 సిక్సర్లు) అదుర్స్ అనిపించారు. జట్టు విజయంలో ఇద్దరి హాఫ్ సెంచరీస్ కీలక పాత్ర పోషించాయి. మరో ఓపెనర్ మయాంక్‌ అగర్వాల్‌ ( Mayank Agarwal 45 పరుగులు: 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చక్కని శుభారంభాన్నిచ్చాడు.  

అంతకుముందు టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ( Virat Kohli 48 పరుగులు: 39 బంతుల్లో 3 ఫోర్లు)తో ఒంటరి పోరాటం చేశాడు. మిగతా వారిలో ఓపెనర్ ఆరోన్‌ ఫించ్‌ (20), శివమ్‌ దూబే (23) ఫర్వాలేదనిపించగా.. మరో ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ ( Devdutt Padikkal ) ఈసారి 18 పరుగులకే సరిపెట్టుకున్నాడు. మరో కీలకమైన బ్యాట్స్‌మేన్ అయిన ఏబి డివిలియర్స్ కూడా ఈసారి 2 పరుగులకే పెవిలియన్ బాటపట్టాడు. Also read : Shreyas Iyer injury update: ఢిల్లీ క్యాపిటల్స్‌కి దెబ్బ మీద దెబ్బ

7వ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన క్రిస్‌ మోరీస్‌ ( Chris morris ) 25 నాటౌట్‌: 8 బంతుల్లో ఫోర్ 3 సిక్సర్లు) స్కోర్‌ను పరుగులెత్తించడంతో జట్టు స్కోర్ మొత్తం 170 దాటించగలిగాడు. పంజాబ్‌ బౌలర్లలో మహ్మద్‌ షమి (2/45), మురుగన్‌ అశ్విన్‌ (2/23) రాణించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News