IPL 2024: 'మైదానంలో ఆ ఇద్దరి నటనకు ఆస్కార్ ఇవ్వొచ్చు..': సునీల్ గవాస్కర్

Viral video: నిన్న బెంగళూరు వేదికగా జరిగిన కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో గంభీర్, కోహ్లీ కౌగిలించుకోవడం అందరినీ షాక్ కు గురిచేసింది. దీనిపై గవాస్కర్ హాట్ కామెంట్స్ చేశాడు.   

Written by - Samala Srinivas | Last Updated : Mar 30, 2024, 06:53 PM IST
IPL 2024: 'మైదానంలో ఆ ఇద్దరి నటనకు ఆస్కార్ ఇవ్వొచ్చు..': సునీల్ గవాస్కర్

Virat Kohli-Gautam Gambhir Hug: శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో ఎవరూ ఊహించని సంఘటన చోటుచేసుకుంది. బద్దశత్రువులైన విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ ఒకరినొకరు కౌగిలించుకోవడం కెమెరా కంట పడింది. ఈ దృశ్యాన్ని చూసి అక్కడ ఉన్నవారందరూ షాక్ తిన్నారు. దీనిపై మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. వారిద్దరి నటనకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలంటూ బాంబ్ పేల్చాడు. 

కోహ్లీ, గంభీర్ ఎప్పుడెప్పుడు గొడవ పడ్డారంటే?
2013లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో తొలిసారి గంభీర్, కోహ్లీ మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత మళ్లీ 2016లో వాగ్వాదం చోటుచోసుకుంది. అనంతరం ఏడేళ్ల తర్వాత గత సీజన్‌లో లక్నోలో మళ్లీ వారద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో అప్పటి నుంచి ఉప్పు-నిప్పులా ఉంటున్న వీరు నిన్న జరిగిన మ్యాచ్ లో ఒకరినొకరు ఆప్యాయంగా కౌగిలించుకోవడంతో గొడవకు ముగింపు పలికినట్లు అయింది. దీనిపై మాజీ క్రికెటర్లు రవిశాస్తి, గవాస్కర్ లు ఘాటుగా స్పందించారు. వీరి నటనకు ఫెయిర్ ఫ్లే అవార్డు ఇవ్వాలని శాస్త్రి అంటే.. ఆస్కార్ కూడా ఇవ్వచ్చొని గవాస్కర్ అన్నాడు. 

కోహ్లీ రాణించినా ఓడిన ఆర్సీబీ..
నిన్న ఎమ్. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై ల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలోఆరు వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. కోహ్లీ మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టుకు మంచి స్కోరు అందించాడు. విరాట్ 59 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 83 పరుగులు చేశాడు. చివర్లో దినేష్ కార్తీక్ మెరుపులు మెరిపించాడు. అతడు కేవలం ఏడు బంతుల్లోనే మూడు సిక్సర్లతో 20 పరుగులు చేశాడు. హర్షిత్‌ రానా, ఆండ్రె రస్సెల్‌ రెండు వికెట్లు తీశాడు. అనంతరం ఛేజింగ్ ప్రారంభించిన కేకేఆర్  16.5 బంతుల్లోనే 186 చేసి విజయం సాధించింది. కేకేఆర్ ఆటగాళ్లలో వెంకటేశ్‌ అయ్యర్‌ 30 బంతుల్లో 50 (3 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. సునీల్‌ నరైన్‌ 47 పరుగులతో సత్తా చాటాడు. 

Also Read: Mansukh Mandaviya Video: క్రికెట్ ఆడిన కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి.. వైరల్ అవుతున్న వీడియో..

Also Read: Mitchell Starc: రూ.24 కోట్ల ప్లేయర్.. ఐపీఎల్‌లో ఉతికి ఆరేస్తున్న బ్యాట్స్‌మెన్.. స్టార్క్‌పై ట్రోలింగ్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x