ముంబయి క్రికెట్ ఆటగాడు పృథ్వీషా 2018లో జరగబోయే అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్‌లో భారత జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. 13 జనవరి నుండి 3 ఫిబ్రవరి 2018 వరకు న్యూజిలాండ్‌లో జరిగే ఈ వరల్డ్ కప్‌కు సంబంధించిన టీమ్ సెలక్షన్స్ ఇటీవలే బీసీసీఐ నిర్వహించింది. ఇప్పటికి అండర్ 19 ప్రపంచ కప్‌ను భారత్ మూడు సార్లు గెలుచుకోవడం గమనార్హం. 2000, 2008, 2012 సంవత్సరాల్లో భారత్ అండర్ 19 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. గత సంవత్సరం మాత్రం వెస్టిండీస్ చేతిలో ఓడిపోయి కేవలం రన్నరప్ టైటిల్‌తోనే సరిపెట్టుకుంది.
2018 ప్రపంచ కప్‌కు బీసీసీఐ ఎంపిక చేసిన అండర్ 19 టీమిండియా జట్టు
పృథ్వీషా (కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), మన్జోత్ కల్రా, హిమాంశు రాణా, అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ఆర్యన్ జుయల్ (వికెట్ కీపర్), హార్వీక్ దేశాయ్ (వికెట్ కీపర్), శివమ్ మావి, కమలేష్ నగర్ కోటి, ఇషాన్ పోరెల్, ఆర్షదీప్ సింగ్, అనుకుల్ రాయ్, శివ సింగ్, పంకజ్ యాదవ్, ఓం భోస్లే, రాహుల్ చాహర్, నినాద్ రత్వా, ఉర్విల్ పటేల్, ఆదిత్య థాక్రే.
పృథ్వీషా: యూ 19 వరల్డ్ కప్‌లో మన కెప్టెన్