Ballon World Cup: అలరించిన 'బెలూన్ ప్రపంచకప్' పోటీలు...ఛాంపియన్ గా పెరూ ఆటగాడు!

Ballon World Cup: మనం చిన్నప్పుడు సరాదాగా ఆడుకునే బెలూన్ లతో ఈ మధ్యే ప్రపంచ కప్ పోటీలు నిర్వహించారు. అసలు ఇలాంటి పోటీలు ఉంటాయని మనలో చాలా మందికి తెలియదు. ఇటీవల ఈ 'బెలూన్ వరల్డ్ కప్' స్పెయిన్ లో జరిగింది. అసలు ఈ  గేమ్ ఎలా పుట్టింది? ఇందులో ఎంత మంది పాల్గొంటారు? తదితర విషయాలు తెలియాలంటే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 21, 2021, 03:25 PM IST
Ballon World Cup: అలరించిన 'బెలూన్ ప్రపంచకప్' పోటీలు...ఛాంపియన్ గా పెరూ ఆటగాడు!

Ballon World Cup: మనం చిన్నప్పుడు బెలూన్లు ఊది..సరాదాగా ఎన్నో ఆటలాడి ఉంటాం. ఆ సరాదా ఆటే ఇప్పుడు అంతర్జాతీయ క్రీడగా మారిపోయింది. ప్రపంచంలో మెుట్టమెుదటి 'బెలూన్ వరల్డ్ కప్'(Ballon World Cup)ను ఈ మధ్యే స్పెయిన్(Spain)లో విజయవంతంగా నిర్వహించారు. ఈ పోటీల్లో పెరూకు చెందిన 'ఫ్రాన్సెస్కో డి లా క్రూజ్‌'(Francesco de la Cruz) ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు.

ఈ ఆట పుట్టిందిలా..
బార్సిలోనా సాకర్‌ ప్లేయర్‌ గెరార్డ్‌ పిక్యూ,  స్పానిష్‌ ఇంటర్నెట్‌ సెలబ్రిటీ ఇబయ్‌ లానోస్‌లు ఈ టోర్నీని నిర్వహించారు. అయితే ఈ ప్రపంచ టోర్నీ పుట్టింది టిక్‌టాక్‌(TikTok)లోని సరదా వీడియోల ఆధారంగా!. యస్‌.. ఓరేగావ్‌(యూఎస్‌)కు చెందిన అర్రెన్‌డోండో ఫ్యామిలీ టిక్‌టాక్‌లో సరదాగా గేమ్స్‌ వీడియోలను పోస్ట్‌ చేసేది. ఆ వీడియోల ఆధారంగా  గెరార్డ్‌ పిక్యూ, ఇబయ్‌ లాబీ లానోస్‌లు ఈ టోర్నీని రూపొందించారు. అంతేకాదు గెరార్డ్‌ పిక్యూ(Gerard Pique) డేవిస్‌ కప్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ను కొత్త రూపంలో మార్చే ప్రయత్నంలో ఉన్నాడు కూడా. స్పెయిన్‌లోని తారాగోనా నగరంలోని ఓ స్టేడియంను బెలూన్‌ వరల్డ్‌ కప్‌ పోటీలకు వేదికగా ఎంచుకున్నారు.

Also Read: Virat Kohli Bowling Video: బ్యాటింగ్ కాదు..బౌలింగ్ తో మెరిసిన కోహ్లీ.. వీడియో వైరల్

ఎలా ఆడాలంటే..!
సింపుల్‌.. బెలూన్‌(Ballon) కిందపడకుండా ఆడాలి. కిందపడితే ప్రత్యర్థి వ్యక్తికి  ఒక పాయింట్‌ వెళ్తుంది. 8X8 మీటర్‌ కోర్టులో ఈ గేమ్‌ను నిర్వహిస్తారు. కాకపోతే లివింగ్‌ రూం లాంటి ఆ కోర్టులో కారు, సోఫా, కుర్చీలు.. ఇలా రకరకాల వస్తువులు ఉంటాయి. 

అమెరికా, రష్యా, చైనా, స్పెయిన్‌, ఇటలీ, ఆస్ట్రేలియా, జర్మనీ, బ్రెజిల్, అర్జెంటీనా, పెరూ, బల్గేరియాతో సహా మొత్తం 32 దేశాల క్రీడాకారులు ఈ పోటీల్లో తమ అదృష్టం పరీక్షించుకున్నారు. మొత్తం ఐదు దశల్లో పోటీలు జరగ్గా జాన్‌ స్పైసెస్‌ (జర్మనీ), ఫ్రాన్సెస్కో డి లా క్రూజ్‌ (పెరూ) ఫైనల్స్‌కు చేరుకున్నారు. తాజాగా జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో డి లా క్రూజ్‌ 6-2 తేడాతో జాన్‌పై విజయం సాధించి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. బెలూన్ ప్రపంచ కప్ పోటీలకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. 

Also read: Strange Village: ప్రపంచంలో వర్షమే కురవని గ్రామం... ఎక్కడో ఉందో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News