PAK Vs SL Highlights: మునివేళ్లపై నిలబెట్టిన మ్యాచ్.. ఆసియా కప్ నుంచి పాకిస్థాన్ ఔట్.. చివరి బంతికి శ్రీలంక సంచలన విజయం

Pakistan vs Sri Lanka Asia Cup 2023: ఆసియా కప్ నుంచి పాకిస్థాన్ నిష్క్రమించింది. సూపర్-4 మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో ఓటమిపాలైంది. అభిమానులను మునివేళ్లపై నిలబెట్టిన పోరులో శ్రీలంక అద్భుత విజయం సాధించింది. భారత్, శ్రీలంక జట్ల మధ్య ఫైనల్ పోరు జరగనుంది.   

Written by - Ashok Krindinti | Last Updated : Sep 15, 2023, 06:44 AM IST
PAK Vs SL Highlights: మునివేళ్లపై నిలబెట్టిన మ్యాచ్.. ఆసియా కప్ నుంచి పాకిస్థాన్ ఔట్.. చివరి బంతికి శ్రీలంక సంచలన విజయం

Pakistan vs Sri Lanka Asia Cup 2023: నరాలు తెగే ఉత్కంఠభరిత పోరులో పాకిస్థాన్‌ జట్టును శ్రీలంక చిత్తు చేసింది. ఆసియా కప్ 2023 సూపర్ 4 మ్యాచ్‌లో పాక్‌ను 2 వికెట్ల తేడాతో ఓడించి.. ఫైనల్‌లో బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది.  డక్‌ వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం.. శ్రీలంక 252 పరుగుల లక్ష్యాన్ని 42 ఓవర్లలో చివరి బంతికి సాధించింది. లంక విజయంలో కుశాల్ మెండిస్ బ్యాట్‌తో కీలక పాత్ర పోషించి 91 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడగా.. చరిత్ అసలంక (49 నాటౌట్), సమర విక్రమ (48) కీలక ఇన్నింగ్స్ ఆడారు. చివరి రెండు ఓవర్లలో శ్రీలంక విజయానికి 12 పరుగులు కావాల్సి ఉండగా.. చేతిలో 5 వికెట్లు ఉండడంతో శ్రీలంక ఈజీగా గెలుస్తుందనిపించింది. అయితే 41 ఓవర్లలో రెండు వికెట్లు తీసిన పాక్.. కేవలం 4 పరుగులే ఇవ్వడంతో మ్యాచ్ ఉత్కంఠకు దారి తీసింది.

ఇక చివరి ఓవర్‌లో 8 పరుగులు చేయాల్సి ఉండగా.. తొలి 3 బంతుల్లో 2 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. నాలుగో బంతికి శ్రీలంక 8వ వికెట్ కోల్పోయింది. శ్రీలంక గెలవాలంటే చివరి 2 బంతుల్లో 6 పరుగులు చేయాల్సి ఉంది. మ్యాచ్ పాక్ వైపు మొగ్గినట్లు అనిపించింది. అయితే అప్పటికే క్రీజ్‌లో పాతుకుపోయిన అసలంక.. ఐదో బంతికి ఫోర్ కొట్టాడు. చివరి బంతికి 2 పరుగులు చేసి జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ఓటమి బాధలో పాక్ ఆటగాళ్లు మైదానంలో తీవ్ర నిరాశకు గురయ్యారు. భారత్‌తో ఆదివారం జరిగే ఫైనల్‌లో శ్రీలంక తలపడనుంది. కుశాల్ మెండిస్‌కు మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డు దక్కింది. 

వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 42 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. ఓపెనర్ షఫీక్ (52), వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ (86 నాటౌట్), ఇఫ్తికార అహ్మద్ (47) రాణించారు. కెప్టెన్ బాబర్ అజామ్ (29), ఫకర్ జమాన్ (4), మహ్మద్ హరీస్ (3) విఫలమయ్యారు. శ్రీలంక బౌలర్లలో మతీషా పతిరణ 3 వికెట్లు తీయగా.. ప్రమోద్ మదుషన్ 2 వికెట్లు పడగొట్టాడు. తీక్షణ, వెల్లలాడే చెరో వికెట్ తీశారు.

252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. ఆరంభంలోనే కుశాల్ పెరీరా (17) వికెట్ కోల్పోయింది. అనంతరం కుశాల్ మెండిస్ 91 పరుగులతో శ్రీలంక ఇన్నింగ్స్‌కు వెన్నముకగా నిలవగా.. అసలంక (49 నాటౌట్), సమర విక్రమ కీలక ఇన్నింగ్స్‌తో శ్రీలంక విజయంతో కీలక పాత్ర పోషించారు. పాక్‌ బౌలర్లలో ఇఫ్తికార్ అహ్మద్ 3 వికెట్లు, షాహీన్ ఆఫ్రిది 2 వికెట్లు పడగొట్టారు. గతేడాది ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌ను ఓడించి టైటిల్ గెలుచుకున్న శ్రీలంక.. ఈసారి ఫైనల్‌ ఫైట్‌లో భారత్‌తో తలపడనుంది.

Also Read: Jawan OTT Release Update: దిమ్మతిరిగే రేటుకు జవాన్ ఓటీటీ రైట్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?  

Also Read: Nipah Virus Latest Updates: ముంచుకొస్తున్న నిపా వైరస్ ముప్పు.. మరో ఇద్దరు మృతి.. రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News