MS Dhoni turns as a Producer in Kollywood: ఎంఎస్ ధోనీ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రపంచ క్రికెట్ హిస్టరీలోనే అత్యుత్తమ కెప్టెన్. క్రికెట్ ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో మూడు ఐసీసీ ట్రోఫీలను (టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ) గెలిచారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసినప్పటి నుంచి ఎన్నో అద్భుతమైన విజయాలను అందించడమే కాకుండా.. భారత క్రికెట్ జట్టును ఉన్నత శిఖరాలకు చేర్చారు. మిస్టర్ కూల్‌గా పేరు సంపాదించుకున్న ధోనీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. 2020లో అందరికీ షాకిస్తూ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చిన మహీ.. ప్రస్తుతం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నారు.
అంతర్జాతీయ క్రికెట్‌కు ఎంఎస్ ధోనీ వీడ్కోలు పలికినా.. అతడి బ్రాండ్ వాల్యూ మాత్రం అసలు తగ్గలేదు. ఇప్పటికీ మహీ పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నాడు. భారత మాజీ క్రికెటర్ ధోనీ తన ఫామ్ హౌస్‌లో వ్యవసాయం కూడా చేస్తారు. అంతేకాదు కడక్‌నాథ్ కోళ్ల వ్యాపారం కూడా ఉంది. ఇవి మాత్రమే కాకుండా మహీకి మరికొన్ని వ్యాపారాలు ఉన్నాయి. తాజాగా మరో బిజినెస్‌లోకి ధోనీ అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం తెలుస్తోంది.
2008లో జరిగిన మొదటి ఐపీఎల్ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ భారీ ధరకు ఎంఎస్ ధోనీని కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే చెన్నైకి మహీ ఏకంగా నాలుగు ట్రోఫీలు అందించారు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా.. మహీ చెన్నైని మాత్రం వదలలేదు. అతడికి ఫాన్స్ ముద్దుగా 'తలా' అని పిలుచుకుంటారు. తమిళనాడులో మహీకి పెద్ద ఎత్తున ఫాలోయింగ్ ఉంది. అయితే అభిమానులకు మరింత దగ్గరయేందుకు ధోనీ సినీ ఇండస్ట్రీలోకి వస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే మహీ కోలీవుడ్‌లో నిర్మాతగా అడుగుపెట్టబోతున్నారట.
ఎంఎస్ ధోనీ తన మొదటి కోలీవుడ్ ప్రాజెక్ట్ కోసం సూపర్ స్టార్ రజనీకాంత్ సన్నిహితుడు సంజయ్‌ని ఎంచుకున్నారట. మహీ తొలి చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తుందని తెలుస్తోంది. ఈ నెలాఖరున ఈ చిత్రం నిర్మాణం ప్రారంభం కానుందట. ఐపీఎల్ 2022 ముగిసిన వెంటనే దీనిపై ధోనీ అధికార ప్రకటన చేస్తారని తెలుస్తోంది. 'ఎంఎస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ' సినిమా ప్రచారంలో భాగంగా తమిళ సినిమాతో అతడికి అనుబంధం ఏర్పడింది. భారత ప్లేయర్స్ ఎస్ శ్రీశాంత్, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ ఇప్పటికే సినిమాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
Also Read: Keerthy Suresh Pics: కీర్తి సురేష్ రేర్ పిక్స్.. కళావతి అందాలు మాములుగా లేవుగా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.