Dewald Brevis: 'జూనియర్‌ ఏబీ'నా మజాకా.. వ‌రుస‌గా 4 సిక్సులు! ఐపీఎల్‌ 2022లోనే భారీ సిక్సర్‌ (వీడియో)!

MI vs PBKS: Dewald Brevis hits 4 sixes off Rahul Chahar over. రాహుల్ చహ‌ర్ వేసిన చివరి బంతిని లాంగ్ ఆన్ దిశగా జూనియర్‌ డివిల్లియ‌ర్స్‌గా పేరున్న డెవాల్డ్ బ్రెవిస్ భారీ సిక్స్ బాధగా.. అది 112 మీటర్ల దూరం వెళ్లింది. ఐపీఎల్ 2022లోనే ఇది భారీ సిక్స్. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 14, 2022, 01:43 PM IST
  • 'జూనియర్‌ ఏబీ'నా మజాకా
  • వ‌రుస‌గా 4 సిక్సులు
  • ఐపీఎల్‌ 2022లోనే భారీ సిక్సర్‌
Dewald Brevis: 'జూనియర్‌ ఏబీ'నా మజాకా.. వ‌రుస‌గా 4 సిక్సులు! ఐపీఎల్‌ 2022లోనే భారీ సిక్సర్‌ (వీడియో)!

IPL 2022, MI vs PBKS: Dewald Brevis hits 4 sixes off Rahul Chahar over: ద‌క్షిణాఫ్రికా యువ క్రికెట‌ర్, జూనియర్‌ డివిల్లియ‌ర్స్‌గా పేరున్న డెవాల్డ్ బ్రెవిస్.. ఐపీఎల్ 2022లో సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. బుధవారం రాత్రి పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ బ్యాట‌ర్ అయిన జూనియర్‌ ఏబీ.. రాహుల్ చహ‌ర్ వేసిన 9వ ఓవ‌ర్లో వరుసగా నాలుగు సిక్సులు బాదాడు. అందులో ఒకటి 112 మీటర్ల భారీ సిక్స‌ర్‌గా నమోదైంది. ఇది ఐపీఎల్ 2022లోనే లాంగెస్ట్ సిక్స్. 

ఓపెనర్ రోహిత్ శ‌ర్మ ఔటైన వెంట‌నే డెవాల్డ్ బ్రెవిస్ క్రీజులోకి వచ్చాడు. నాలుగో ఓవర్లో బ్యాటింగ్‌కు దిగిన 18 ఏళ్ల ద‌క్షిణాఫ్రికా యువ ఆటుగాడు ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. ఇషాన్ కిష‌న్ ఔట్ అయినా.. తిల‌క్ వ‌ర్మ‌తో క‌లిసి వేగంగా పరుగులు చేశాడు. ఈ క్రమంలో రాహుల్ చహ‌ర్ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవ‌ర్లో విశ్వ‌రూపం ప్రదర్శించాడు. 9వ ఓవ‌ర్ రెండో బంతిని ఫోర్ బాదిన జూనియర్‌ ఏబీ.. 3, 4, 5, 6 బంతుల‌ను వ‌రుస‌గా భారీ సిక్స‌ర్లుగా బాదాడు. బ్రెవిస్ దెబ్బకు చహ‌ర్ ఏకంగా 29 ప‌రుగులు స‌మ‌ర్పించుకోవాల్సి వ‌చ్చింది.

రాహుల్ చహ‌ర్ వేసిన చివరి బంతిని లాంగ్ ఆన్ దిశగా డెవాల్డ్ బ్రెవిస్ భారీ సిక్స్ బాధగా.. అది 112 మీటర్ల దూరం వెళ్లింది. ఐపీఎల్ 2022లోనే ఇది భారీ సిక్స్. ఐపీఎల్ 2022లో అంతకుముందు పంజాబ్‌ కింగ్స్‌ హిట్టర్ లియామ్ లివింగ్‌స్టోన్ 108 మీటర్ల భారీ సిక్స్ బాదిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 25 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సులతో జూనియర్‌ ఏబీ 49 పరుగులు చేశాడు. కేవలం ఒక్క పరుగు తేడాతో తన తొలి అర్ధ సెంచరీని చేజార్చుకున్నాడు. 

వెస్టిండీస్ వేదికగా జరిగిన అండర్ 19 ప్రపంచకప్‌ 2022లో డెవాల్డ్ బ్రేవిస్.. బౌలర్లను ఊచకోతకొస్తూ పరుగుల వరద పారించాడు. మెగా టోర్నమెంట్‌లో ఆడిన 6 మ్యాచ్‌లలో 2 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలతో 506 పరుగులు చేశాడు. దాంతో జూనియర్‌ ఏబీని దక్కించుకునేందుకు ఐపీఎల్ ప్రాంచైజీలు పోటీ పడ్డాయి. ముంబై ఇండియన్స్ అతడిని రూ. 3 కోట్లకు సొంతం చేసుకుంది. జూనియర్ డివిలియర్స్‌ కనీస ధర రూ. 20 లక్షలు కాగా.. ప్రాంఛైజీలు పోటీ పడడంతో జాక్ పాట్ దక్కింది.

Also Read: Krithi Shetty: చందమామలా మెరిసిపోతున్న కృతి శెట్టి.. బేబమ్మ అందాలకు కుర్రాళ్లు ఫిదా!

Also Read: Renault April Offers: కొత్త కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా... రెనాల్ట్‌లో భారీ ఆఫర్స్...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News