Matthew Wade Wicket: మళ్లీ అంపైర్ తప్పిదం! కోపంతో బ్యాట్ ను బాదిన మాథ్యూ వేడ్!

Matthew Wade Wicket: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో గురువారం జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్ తలపడ్డాయి. వాంఖడే వేదికగా తమ చివరి లీగ్ మ్యాచ్ ను ఆడిన ఇరుజట్లలో ఇప్పటికే గుజరాత్ ప్లేఆఫ్స్ కు చేరుకుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన ఆర్సీబీ ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా నిలుపుకొంది. అయితే ఈ మ్యాచ్ లో ఔట్ అయిన తర్వాత మాథ్యూ వేడ్ కోపంతో ఏం చేశాడో మీరే చూడండి. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 20, 2022, 11:21 AM IST
Matthew Wade Wicket: మళ్లీ అంపైర్ తప్పిదం! కోపంతో బ్యాట్ ను బాదిన మాథ్యూ వేడ్!

Matthew Wade Wicket: ఐపీఎల్ 2022 గురువారం రాత్రి జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడ్డాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఐపీఎల్ 2002 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన గుజరాత్ టీమ్.. ఇప్పటికే ప్లేఆఫ్స్ అర్హత సాధించి.. ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో గుజరాత్ పై గెలుపొంది.. ప్లేఆఫ్స్ ఆశలను సజీవం చేసుకుంది. 

అయితే ఈ మ్యాచ్ ఆరంభం నుంచే ఎంతో ఉత్కంఠగా సాగింది. గుజరాత్ బ్యాటింగ్ లోని మూడో ఓవర్ లో ఓపెనర్ శుభ్ మన్ గిల్ వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన మాథ్యూ వేడ్ 13 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ తో 16 పరుగులు నమోదు చేశాడు. 

పవర్ ప్లే లోని ఆఖరి ఓవర్ ను మ్యాక్స్ వెల్ బౌలింగ్ చేశాడు. మ్యాక్స్ వెల్ చేతిలో మాథ్యూ వేడ్ LBWగా వెనుదిరిగాడు. అయితే దీనిపై మాథ్యూ వేడ్ డీఆర్ఎస్ కోరగా.. బంతి బ్యాట్ కు చాలా దగ్గర వెళ్లినట్లు కనిపించింది. అయితే థర్డ్ అంపైర్ కూడా పెద్దగా స్పార్క్ చూపించకపోవడంతో ఔట్ ఇచ్చాడు.

ఔట్ అయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లిన మాథ్యూ వేడ్.. కోపంతో తన బ్యాట్ ను నేలపైకి బలంగా విసిరాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంపైర్ నిర్ణయంతో కోపం తెచ్చుకున్న మాథ్యూ వేడ్ కోపంతో మైదానాన్ని వీడాడు. అయితే ఐపీఎల్ లో తప్పుడు నిర్ణయాలు ప్రకటించడం ఇదే తొలిసారి కాదు. గతంలో చాలా నిర్ణయాలు వివాదానికి దారి తీశాయి. 

Also Read: Glenn Maxwell Catch: ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ పట్టిన గ్లెన్ మాక్స్‌వెల్.. విరాట్ కోహ్లీ రియాక్షన్ చూస్తే..!

Also Read: IPL 2022 Final: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఐపీఎల్ 2022 ఫైనల్‌ మ్యాచ్‌ ఎప్పుడో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News