Massive Earthquake felt before start of the Bangladesh vs Pakistan match: శుక్రవారం తెల్లవారుజామున మయన్మార్-భారత్ సరిహద్దు ప్రాంతంలో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. బంగ్లాదేశ్‌లోని ఛటోగ్రామ్ (Chattogram)నగరంలో కూడా భూకంపం సంభవించింది. అక్కడ రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.3గా నమోదైంది. బంగ్లాదేశ్‌లోని ఢాకా, చిట్టగాంగ్ మరియు ఇతర నగరాల్లో భూమి కంపించింది. దీంతో బంగ్లాదేశ్ (Bangladesh), పాకిస్తాన్ (Pakistan)క్రికెటర్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మరోవైపు భారత దేశంలోని కోల్‌కతా వరకు భూకంపం సంభవించినట్లు యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) తమ వెబ్ సైట్లో పేర్కొంది.
ఛటోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ (Bangladesh vs Pakistan) జట్ల మధ్య తొలి టెస్ట్ శుక్రవారం ఉదయం ప్రారంభం కావాల్సి ఉంది. ఈ మ్యాచ్ ఆరంభానికి కొద్ది గంటల ముందు అక్కడ భూకంపం సంభవించింది. ఇరు జట్ల క్రికెటర్లు (Cricketers) భయాందోళనలకు గురయ్యారు. దాంతో మ్యాచ్ జరుగుతుందా? లేదా? అనుమానం కలిగింది. అయితే భూకంప తీవ్రత మ్యాచ్ నిర్వహణపై ఎటువంటి ప్రభావం చూపలేదు. నిర్ణీత సమయానికే తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. టీ20 ప్రపంచకప్ 2021 అనంతరం పాకిస్తాన్ జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. టీ20 సిరీస్ ముగించుకుని.. టెస్ట్ సిరీస్ ఆడుతోంది.
పాక్ ఆటగాళ్లు అందరూ క్షేమంగా ఉన్నారని పాకిస్థాన్ క్రికెట్ జట్టు మేనేజర్ మన్సూర్ ( Mansoor Rana) రాణా ఓ ప్రకటనలో తెలిపారు. 'తొలి టెస్ట్ మ్యాచ్ ఆరంభానికి కొన్ని గంటల ముందు పాక్ ఆటగాళ్లు ఉన్న ఛటోగ్రామ్ నగరంలో భూకంపం సంభవించింది. దాంతో పాక్ ప్లేయర్స్ (Pakistan Cricketers) ఆందోళన చెందారు. అదృష్టవశాత్తు అక్కడ ఎలాంటి నష్టం జరగలేదు. ఆటగాళ్లు క్షేమంగా ఉన్నారు. నిర్ణీత సమయానికే తొలి టెస్ట్ మ్యాచ్ ఆరంభం అయింది' అని మన్సూర్ రాణా చెప్పారు.
Shreyas Iyer: అరంగేట్రంలోనే సెంచరీతో అదరగొట్టిన అయ్యర్.. మూడో భారత బ్యాటర్‌గా రికార్డు!!
ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేస్తున్న బంగ్లాదేశ్ 66 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ షాద్మాన్ ఇస్లాం (14), సైఫ్ హసన్ (14), నజ్ముల్ హుస్సేన్ శాంటో (14), మోమినుల్ హక్ (6) విఫలమయినా.. ముష్ఫికర్ రహీమ్ (69 నాటౌట్), లిటన్ దాస్ (70 నాటౌట్) హాఫ్ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. ఇక బంగ్లా టీ20 కెప్టెన్ మహ్మదుల్లా టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. మోమినుల్ హక్ జట్టు పగ్గాలు అందుకున్నాడు. టీ20 సిరీస్‌లో బంగ్లాదేశ్‌ను వైట్ వాష్ చేసిన పాకిస్తాన్.. టెస్ట్ సిరీస్‌పై కన్నేసింది. మరోవైపు కనీసం టెస్ట్ సిరీస్ అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని బంగ్లా చూస్తోంది.
Ranveer Singh 83 Teaser: కపిల్‌దేవ్ బయోపిక్.. ‘83’ మూవీ టీజర్ అదిరిపోయిందిగా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook