IPL Mega Auction 2025 Live Updates: నక్కతోక తొక్కిన ప్లేయర్లు వీళ్లే.. వామ్మో అన్ని కోట్లా..!

IPL Mega Auction 2025 Live News: ఐపీఎల్ 2025 మెగా వేలం నేడు, రేపు జరగనుంది. 577 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ఐపీఎల్ వేలం ప్రారంభంకానుంది. లైవ్ అప్‌డేట్స్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  

Written by - Ashok Krindinti | Last Updated : Nov 24, 2024, 11:08 PM IST
IPL Mega Auction 2025 Live Updates: నక్కతోక తొక్కిన ప్లేయర్లు వీళ్లే.. వామ్మో అన్ని కోట్లా..!
Live Blog

IPL Mega Auction 2025 Live News: క్రికెట్ అభిమానులు ఎంతోగానో ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. ఐపీఎల్ 2025 మెగా వేలానికి సర్వం సిద్ధమైంది. మొత్తం 577 మంది ఆటగాళ్లు వేలంలో ఉండగా.. 10 ఫ్రాంచైజీలు ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు రెడీ అయ్యాయి. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, అర్ష్‌దీప్ సింగ్, షమీ వంటి స్టార్ ప్లేయర్లు వేలంలోకి వస్తుండడంతో భారీ ఆసక్తి నెలకొంది. రూ.25 కోట్ల రికార్డు బ్రేక్ అవుతుందని అందరూ అంచనా వేస్తున్నారు. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా నేడు, రేపు రెండు రోజులపాటు వేలం కొనసాగనుంది. ఈ రోజు వేలంలోకి పంత్, అయ్యర్, అర్ష్‌దీప్‌ రానుండగా.. రెండో సెట్‌లో రేపు కేఎల్ రాహుల్, యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ పేర్లు ఉన్నాయి. మొత్తం 1574 మంది ఆటగాళ్లు పేర్లు నమోదు చేసుకోగా.. 1000 మంది పేర్లు తొలగించి 574 మంది ఆటగాళ్ల పేర్లు షార్ట్ లిస్ట్ చేశారు. మొత్తం 366 మంది భారత ఆటగాళ్లు కాగా.. 208 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు వేలం మొదలుకానుంది. ఐపీఎల్ 2025 వేలానికి సంబంధించి లైవ్‌ అప్‌డేట్స్‌ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.
 

24 November, 2024

  • 23:08 PM

    IPL Auction 2025 Live Updates: ఇవాళ్టి ఐపీఎల్ వేలం ముగిసింది. రేపు మిగిలిన ప్లేయర్లను వేలం వేయనున్నారు. 

  • 23:07 PM

    IPL Auction 2025 Live Updates: మానవ్ సుతార్‌ను గుజరాత్ రూ.30 లక్షలకు తీసుకుంది.

  • 23:04 PM

    IPL Auction 2025 Live Updates: కార్తీకేయ సింగ్‌ను రూ.30 లక్షలకు రాజస్థాన్ రాయల్స్ తీసుకుంది.

  • 23:03 PM

    IPL Auction 2025 Live Updates: మయాంక్ మార్కండేను కేకేఆర్ రూ.30 లక్షలకు తీసుకుంది.

  • 23:01 PM

    IPL Auction 2025 Live Updates: కర్ణ్‌ శర్మను ముంబై ఇండియన్స్ రూ.50 లక్షలకు తీసుకుంది.

  • 22:58 PM

    IPL Auction 2025 Live Updates: స్పిన్నర్ సుయాష్‌ శర్మను రూ.2.60 కోట్లకు RCB దక్కించుకుంది.

  • 22:54 PM

    IPL Auction 2025 Live Updates: సిమర్‌జిత్ సింగ్‌ను రూ.కోటి 50 లక్షలకు SRH దక్కించుకుంది.

  • 22:52 PM

    IPL Auction 2025 Live Updates: యష్‌ ఠాకూర్‌ను రూ.కోటి 60 లక్షలకు పంజాబ్ కింగ్స్ తీసుకుంది.

  • 22:48 PM

    IPL Auction 2025 Live Updates: వైభవ్ అరోరాను రూ.కోటి 80 లక్షలకు కేకేఆర్ సొంతం చేసుకుంది.

  • 22:45 PM

    IPL Auction 2025 Live Updates: విజయ్ కుమార్ వైషాక్‌ను రూ.కోటి 80 లక్షలకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది.

  • 22:42 PM

    IPL Auction 2025 Live Updates: సీనియర్ పేసర్ మోహిత్ శర్మ రూ.2.20 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.

  • 22:38 PM

    IPL Auction 2025 Live Updates: గతేడాది ముంబై తరుఫున అదరగొట్టిన పేస్ బౌలర్ ఆకాశ్ మధ్వల్‌ను రూ.కోటి 20 లక్షలకు రాజస్థాన్ తీసుకుంది.

  • 22:34 PM

    IPL Auction 2025 Live Updates: రసీక్ దార్‌కు భారీ ధర దక్కింది. రూ.6 కోట్లకు ఆర్‌సీబీ సొంతం చేసుకుంది.

  • 22:31 PM

    IPL Auction 2025 Live Updates: విష్ణు వినోద్‌ను రూ.95 లక్షలకు పంజాబ్ తీసుకుంది.
     

  • 22:21 PM

    IPL Auction 2025 Live Updates: అనుజ్ రావత్‌ను రూ.30 లక్షలకు గుజరాత్ టైటాన్స్ తీసుకుంది.

  • 22:20 PM

    IPL Auction 2025 Live Updates: రాబిన్ మింజ్‌ను రూ.65 లక్షలకు తీసుకుంది ముంబై ఇండియన్స్.

  • 22:19 PM

    IPL Auction 2025 Live Updates: వికెట్ కీపర్ కుమార్ కుశాగ్రను గుజరాత్ టైటాన్స్ రూ.65 లక్షలకు తీసుకుంది.
     

  • 22:15 PM

    IPL Auction 2025 Live Updates: అశుతోష్‌ శర్మ భారీ ధర దక్కించుకున్నాడు. రూ.3.80 కోట్లకు ఢిల్లీ దక్కించుకుంది.

  • 22:08 PM

    IPL Auction 2025 Live Updates: మహిపాల్ లోమ్రోర్‌ను రూ.కోటి 70 లక్షలకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది.

  • 22:05 PM

    IPL Auction 2025 Live Updates: ఆల్‌రౌండర్ విజయ శంకర్‌ను రూ.కోటి 20 లక్షలకు సీఎస్‌కే దక్కించుకుంది.

  • 22:03 PM

    IPL Auction 2025 Live Updates: హర్‌ప్రీత్ బార్‌ను రూ.కోటి 50 లక్షలకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది.

  • 22:00 PM

    IPL Auction 2025 Live Updates: అబ్దుల్ సమద్‌ను రూ.4.20 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకుంది.
     

  • 21:54 PM

    IPL Auction 2025 Live Updates: నమన్‌ధీర్‌ను రూ.3.40 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ మొదట సొంతం చేసుకోగా.. ముంబై ఇండియన్స్ ఆర్‌టీఎమ్ కార్డును ఉపయోగించింది. రూ.5.25 కోట్లకు రాజస్థాన్‌ ఫైనల్‌ బిడ్ వేయగా.. ఆ మొత్తాన్ని చెల్లించి ముంబై తీసుకుంది.

  • 21:47 PM

    IPL Auction 2025 Live Updates: గతేడాది వేలంలో రూ.8.4 కోట్లు దక్కించుకున్న సమీర్ రిజ్వి.. ఈసారి వేలంలో కేవలం రూ.95 లక్షలకే అమ్ముడుపోయాడు. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ తీసుకుంది.

  • 21:45 PM

    IPL Auction 2025 Live Updates: ఆల్‌రౌండర్ నిశాంత్ సింధును రూ.30 లక్షలకు గుజరాత్ టైటాన్స్ తీసుకుంది.

  • 21:38 PM

    IPL Auction 2025 Live Updates: అభినవ్ మనోహర్‌ను రూ.3.20 కోట్లకు SRH దక్కించుకుంది.

  • 21:36 PM

    IPL Auction 2025 Live Updates: కరుణ్‌ నాయర్‌ను రూ.50 లక్షలకు తీసుకుంది ఢిల్లీ క్యాపిటల్స్.

  • 21:35 PM

    IPL Auction 2025 Live Updates: అంగ్‌క్రిష్ రఘువన్షి రూ.30 లక్షల బేస్‌ ప్రైస్‌తో వేలంలోకి రాగా.. రూ.3 కోట్లకు కేకేఆర్ దక్కించుకుంది. గతేడాది కేకేఆర్ తరుఫున దుమ్ములేపిన విషయం తెలిసిందే.

  • 21:31 PM

    IPL Auction 2025 Live Updates: గత ఐపీఎల్‌లో అదరగొట్టిన నెహల్ వధేరా కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. రూ.30 లక్షల బేస్‌ ప్రైస్‌తో వేలంలోకి రాగా.. రూ.4.20 కోట్లకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది.

  • 21:26 PM

    IPL Auction 2025 Live Updates: అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్ అథర్వ టైడేను రూ.30 లక్షలకు ఎస్ఆర్‌హెచ్‌ తీసుకుంది.

  • 20:58 PM

    IPL Auction 2025 Live Updates: ఆఫ్గాన్ స్పిన్నర్ నూర్ అహ్మద్‌ కోసం ముంబై, చెన్నై తీవ్రంగా పోటీ పడ్డాయి. వేలంలో మొదట చెన్నై రూ.5 కోట్లకు దక్కించుకోగా.. గుజరాత్ టైటాన్స్ ఆర్‌టీఏమ్ కార్డు ఉపయోగించింది. రూ.10 కోట్లకు చెన్నై ఫైనల్ బీడ్ వేయడంతో గుజరాత్ తప్పుకుంది. 

  • 20:55 PM

    IPL Auction 2025 Live Updates: ఆఫ్గాన్ స్పిన్నర్ వకార్ సలామ్‌ఖీల్ అన్ సోల్డ్ ప్లేయర్‌గా మిగిలిపోయాడు.

  • 20:54 PM

    IPL Auction 2025 Live Updates: శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగను రూ.5.25 కోట్లకు రాజస్థాన్ సొంతం చేసుకుంది.

  • 20:50 PM

    IPL Auction 2025 Live Updates: ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపాను రూ.2.40 కోట్లకు సన్‌రైజర్స్ దక్కించుకుంది.

  • 20:48 PM

    IPL Auction 2025 Live Updates: స్పిన్నర్ రాహుల్ చాహర్‌ను రూ.3.20 కోట్లకు ఎస్‌ఆర్‌హెచ్‌ కొనుగోలు చేసింది. 

  • 20:44 PM

    IPL Auction 2025 Live Updates: శ్రీలంక స్పిన్నర్ మహీష్‌ తీక్షణ రూ.2 కోట్ల బేస్‌ప్రైస్‌తో రాగా.. రూ.4.40 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది.

  • 20:41 PM

    IPL Mega Auction 2025 Live Updates: కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్‌ రూ.2 కోట్లతో వేలంలోకి రాగా.. మరోసారి అదిరిపోయే రేటుకు అమ్ముడుపోయాడు. రూ.12.50 కోట్లకు ముంబై ఇండియన్స్ దక్కించుకుంది.

  • 20:37 PM

    IPL Auction 2025 Live Updates: యార్కర్ స్పెషలిస్ట్ టి.నటరాజన్‌ ఊహించని ధర దక్కించుకున్నాడు. రూ.10.75 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.
     

  • 20:31 PM

    IPL Auction 2025 Live Updates: టీమిండియా పేసర్ ఖలీల్ అహ్మద్‌ను రూ.4.80 కోట్లకు చెన్నై కొనుగోలు చేసింది.

  • 20:29 PM

    IPL Auction 2025 Live Updates: ఇంగ్లాండ్ స్పీడ్ బౌలర్ జోఫ్రా అర్చర్ రూ.2 కోట్లతో వేలంలోకి రాగా.. ఏకంగా రూ.12.50 కోట్ల ధర పలికాడు. ముంబైతో పోటీ పడి రాజస్థాన్ సొంతం చేసుకుంది.

  • 20:22 PM

    IPL Auction 2025 Live Updates: సౌతాఫ్రికా పేసర్ అన్రిచ్ నోకియాను రూ.6.50 కోట్లకు కేకేఆర్ కొనుగోలు చేసింది.

  • 20:20 PM

    IPL Auction 2025 Live Updates: టీమిండియా పేసర్ అవేశ్‌ ఖాన్ భారీ ధరకు అమ్ముడుపోయాడు. రూ.2 కోట్లతో వేలంలోకి రాగా.. రూ.9.75 కోట్లకు లక్నో సూజర్ జెయింట్స్ సొంతం చేసుకుంది.

  • 20:14 PM

    IPL Auction 2025 Live Updates: టీమిండియా పేసర్ ప్రసిద్ద్ కృష్ణపై కనక వర్షం కురిసింది. రూ.9.50 కోట్లకు గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది.

  • 20:08 PM

    IPL Mega Auction 2025 Live Updates: ఆసీస్ పేస్‌ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ మరోసారి భారీ దక్కించుకున్నాడు. రూ.12.50 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది.

  • 20:04 PM

    IPL Mega Auction 2025 Live Updates: వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జితేష్‌ శర్మ భారీ దక్కించుకున్నాడు. రూ.కోటితో వేలంలో రాగా.. మొదట రూ.7 కోట్లకు ఆర్‌సీబీ దక్కించుకుంది. అయితే పంజాబ్ ఆర్‌టీఎమ్ కార్డును ఉపయోగించడంతో ఆర్‌సీబీ రూ.11 కోట్లకు ఫైనల్ బిడ్ వేసింది. పంజాబ్ తప్పుకోవడంతో ఆర్‌సీబీ సొంతమయ్యాడు.

  • 19:57 PM

    Ishan Kishan Price in IPL Mega Auction 2025: రూ.2 కోట్లతో ఇషాక్ కిషన్ వేలంలోకి రాగా.. ముంబై ఇండియన్స్ బిడ్ ఆరంభించింది. ఆ తరువాత పంజాబ్, ఢిల్లీ పోటీ పడ్డాయి. చివర్లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఎంట్రీ ఇచ్చి రూ.11.25 కోట్లకు సొంతం చేసుకుంది.

  • 19:48 PM

    IPL Mega Auction 2025 Live Updates: అఫ్గాన్ ప్లేయర్ రహ్మనుల్లా గుర్బాజ్‌ను రూ.2 కోట్లకు కేకేఆర్ దక్కించుకుంది.

  • 19:47 PM

    IPL Mega Auction 2025 Live Updates: ఫిల్‌ సాల్ట్‌ను రూ.11.50 కోట్లకు ఆర్‌సీబీ సొంతం చేసుకుంది. కేకేఆర్ గట్టిగా ప్రయత్నించినా.. ఆర్‌సీబీ వెనక్కి తగ్గలేదు.

  • 19:39 PM

    IPL Mega Auction 2025 Live Updates: ఇంగ్లాండ్ ప్లేయర్ జానీ బెయిర్‌స్టో అన్‌సోల్డ్ ప్లేయర్‌గా మిగిలిపోయాడు.

  • 19:38 PM

    IPL Mega Auction 2025 Live Updates: క్వింటన్ డికాక్‌ను రూ.3.60 కోట్లకు కోల్‌కతా నైట్‌రైడర్స్ సొంతం చేసుకుంది.

Trending News