PAK vs NZ T20 World Cup 2021: న్యూజిలాండ్‌పై పాకిస్థాన్ విజయం.. చెలరేగిపోయిన Haris Rauf, Asif Ali

LIVE PAK vs NZ T20 World Cup 2021 Live Cricket Score Updates: షోయబ్ మాలిక్ (Shoaib Malik) 20 బంతుల్లో 26 పరుగులు రాబట్టగా, ఆసిఫ్ అలీ (Asif Ali) 12 బంతుల్లోనే 27 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. అంతిమంగా ఈ ఇద్దరూ కలిసి జట్టును విజయ తీరాలకు చేర్చారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 27, 2021, 05:20 AM IST
PAK vs NZ T20 World Cup 2021: న్యూజిలాండ్‌పై పాకిస్థాన్ విజయం.. చెలరేగిపోయిన Haris Rauf, Asif Ali

LIVE PAK vs NZ T20 World Cup 2021 Live Cricket Score Updates: ఐసిసి పురుషుల టీ20 వరల్డ్ కప్‌ సూపర్ 12 గ్రూప్-2 మ్యాచ్‌లో భాగంగా మంగళవారం షార్జా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై పాకిస్తాన్ విజయం సాధించింది. ఇప్పటికే భారత్‌పై గెలిచిన జోరుమీదున్న పాకిస్థాన్‌కి ఈ విజయం టోర్నీలో దూసుకుపోయేందుకు మరింత బూస్టింగ్ అందించింది. 16వ ఓవర్ వరకు న్యూజీలాండ్‌ వైపే (New Zealand) ఉన్నట్టుగా కనిపించిన విజయం.. ఆ తర్వాతి ఓవర్‌లో చేతులు మారింది. 

కివీస్ బౌలర్ టిమ్ సౌథీ (Tim Southee) వేసిన 17వ ఓవర్ మ్యాచ్ ఫలితాన్నే మార్చేసి విజయాన్ని పాకిస్థాన్‌ ఖాతాలో వేసుకునేలా చేసింది. 

Also read : Ind vs NZ match: న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో Hardik Pandya ఉంటాడా లేదా ?

135 పరుగుల స్వల్ప విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ (Pakistan) 87 పరుగుల వద్ద ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిందనుకున్న సమయంలో బ్యాట్ పట్టుకున్న ఆసిఫ్ అలీ, పాక్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కబెట్టి ఆ జట్టుకు విజయాన్ని అందించాడు. 

షోయబ్ మాలిక్ (Shoaib Malik) 20 బంతుల్లో 26 పరుగులు రాబట్టగా, ఆసిఫ్ అలీ (Asif Ali) 12 బంతుల్లోనే 27 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. అంతిమంగా ఈ ఇద్దరూ కలిసి జట్టును విజయ తీరాలకు చేర్చారు. మొత్తానికి న్యూజిలాండ్‌పై గెలుపుతో పాయింట్స్ టేబుల్‌లో పాకిస్థాన్ (Pak vs Nz match) మరో అడుగు పైకి వేసిందనే చెప్పుకోవచ్చు.

Also read : T20 World Cup 2021: అదరగొట్టిన మార్‌క్రమ్‌...వెస్టిండీస్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం..

Also read : Team India: టీమిండియా హెడ్‌కోచ్‌ నియామకానికి రాహుల్‌ ద్రవిడ్ దరఖాస్తు...NCA హెడ్ రేసులో లక్ష్మణ్!

Also read : Afghanistan vs Scotland match: స్కాట్లాండ్‌‌ని 130 పరుగుల తేడాతో చిత్తు చేసిన అఫ్గానిస్తాన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News