Kyle Mayers Six: వాట్ ఏ షాట్.. నెవర్ బిఫోర్ సిక్స్! వీడియో చూస్తే మతిపోవాల్సిందే

Kyle Mayers smashes back-foot cover drive six. క్రికెట్ చరిత్రలో అద్భుతమైన షాట్ అనేలా వెస్టిండీస్ హిట్టర్ కైల్ మేయర్స్ బాదాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Oct 6, 2022, 01:10 PM IST
  • వాట్ ఏ షాట్
  • నెవర్ బిఫోర్ సిక్స్
  • వీడియో చూస్తే మతిపోవాల్సిందే
Kyle Mayers Six: వాట్ ఏ షాట్.. నెవర్ బిఫోర్ సిక్స్! వీడియో చూస్తే మతిపోవాల్సిందే

Kyle Mayers hits stunning back-foot cover drive six in Cameron Green bowling: వెస్టిండీస్‌ ప్లేయర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైదానంలో భారీ, సరికొత్తగా సిక్సులు బాదడంలోవాళ్లది ప్రత్యేక శైలి. క్రిస్ గేల్, కీరన్ పోలార్డ్, ఆండ్రీ రస్సెల్, డ్వేన్ బ్రావో, జాసన్ హోల్డర్, కార్లోస్ బ్రాత్‌వైట్, షిమ్రాన్ హెట్మేయర్, నికోలస్ పూరన్, కైల్ మేయర్స్ లాంటి ఆటగాళ్లు భారీ సిక్సులు బాదగలరు. అందరిలో కైల్ మేయర్స్ కాస్త కొత్తగా భారీ భారీ సిక్సులు బాదగలడు. తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. క్రికెట్ చరిత్రలో అద్భుతమైన షాట్ అనేలా కొట్టాడు. ప్రస్తతం ఇందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. 

బుధవారం నుంచి ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్ల మధ్య మొదటి టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ నాలుగో ఓవర్లో కైల్ మేయర్స్ ఓ అద్భుతమైన షాట్ ఆడాడు. వెస్టిండీస్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌ను కామెరాన్ గ్రీన్ వేశాడు. ఆ ఓవర్ మూడో బంతిని గ్రీన్ షార్ట్ పిచ్‌గా అందించగా.. బ్యాక్‌ఫుట్‌లో ఉన్న మేయర్స్ కవర్ వైపుగా భారీ షాట్ ఆడాడు. 143 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన ఆ బంతి.. మేయర్స్ ఆడిన విధానంకు 105 మీటర్ల దూరంలో పడింది. దాంతో ఫాన్స్ అందరూ కేకలు వేశారు.

కైల్ మేయర్స్ బాదిన సిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మేయర్స్ షాట్ సెలెక్షన్, సమయస్ఫూర్తికి అబిమానులతో పాటుగా మాజీలు అంతా ఫిదా అవుతున్నారు. ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ ట్వీట్ చేస్తూ.. క్రికెట్ చరిత్రలో ఓ మంచి షాట్ చూశా అని పేర్కొన్నాడు. 'షాట్ ఆఫ్ ది సెంచరీ', 'వాట్ ఏ షాట్.. నెవర్ బిఫోర్ సిక్స్' అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

Also Read: Kerala Bus Accident: ఆర్టీసీ బస్సును ఢీకొన్న టూరిస్ట్ బస్సు.. 9 మంది మృతి..

Also Read: Ananya Nagalla Saree Photos: అందాల ఆరబోత బోర్ కొట్టిందేమో.. పద్దతిగా చీరకట్టులో కవ్విస్తున్న అనన్య నాగళ్ల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

 

Trending News