KL Rahul Vice Captain: సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ కు వైస్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్

KL Rahul Vice Captain: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్​లో భాగంగా టీమ్​ఇండియా ఓపెనర్​ కేఎల్​ రాహుల్ కీలక బాధ్యతలు చేపట్టనున్నాడు. గాయం కారణంగా జట్టుకు దూరమైన రోహిత్​ శర్మ స్థానంలో రాహుల్ వైస్​ కెప్టెన్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడని బీసీసీఐ స్పష్టం చేసింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 18, 2021, 06:18 PM IST
KL Rahul Vice Captain: సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ కు వైస్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్

KL Rahul Vice Captain: సౌతాఫ్రికాతో జరగనున్న టెస్టు సిరీస్ కోసం భారత జట్టు సన్నద్ధమవుతోంది. అయితే గాయం కారణంగా ఈ సిరీస్ కు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కాగా.. అతడి స్థానంలో యువ బ్యాటర్ కేఎల్ రాహుల్ ను నియమిస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI News) ప్రకటించింది. 

సొంతగడ్డపై న్యూజిలాండ్​తో సిరీస్​ అనంతరం అజింక్య రహానెను టెస్టు జట్టు వైస్​ కెప్టెన్​గా తొలగించింది బీసీసీఐ. టెస్టు జట్టుకు వైస్​ కెప్టెన్​గా, వన్డే జట్టుకు కెప్టెన్​గా రోహిత్​ శర్మను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే.. హిట్​మ్యాన్​ టెస్టు సిరీస్​కు దూరమైన కారణంగా రాహుల్​ వైస్​ కెప్టెన్ బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. 

మూడు మ్యాచ్​ల టెస్టు సిరీస్​కు రోహిత్ దూరమవుతున్నట్లు ప్రకటించిన బీసీసీఐ.. అతడి స్థానంలో ప్రియాంక్ పంచాల్​కు చోటు కల్పించింది. ప్రస్తుతం హిట్​మ్యాన్​ ఎన్​సీఏలో ఉండి ఫిట్​నెస్​పై దృష్టి పెట్టాడు. సఫారీలతో తొలి టెస్టు డిసెంబర్​ 26న ప్రారంభం కానుంది. ఈమేరకు భారత జట్టు రెండు రోజుల క్రితమే దక్షిణాఫ్రికాకు చేరుకుంది.  

Also Read: Gautam Gambhir: మళ్లీ ఐపీఎల్​లోకి గౌతమ్​ గంభీర్​- కొత్త టీమ్​కు మెంటార్​గా..

Also Read: Glenn Maxwell: భారత అల్లుడు కాబోతున్న మాక్స్‌వెల్-పెళ్లిపై గర్ల్‌ఫ్రెండ్‌ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News