KKR Vs SRH Dream11 Team: కీలక పోరుకు సన్‌రైజర్స్ సిద్ధం.. కేకేఆర్‌తో బిగ్‌ ఫైట్.. హెడ్ టు హెడ్ రికార్డులు, డ్రీమ్11 టీమ్ టిప్స్ ఇలా

Kolkata Knight Riders vs Sunrisers Hyderabad Playing XI Dream11 Team Tips: క్వాలిఫైయర్-1 పోరులో నేడు కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ పోరులో ఎవరు గెలిచే అవకాశం ఉంది..? పిచ్ రిపోర్టు ఎలా ఉంది..? డ్రీమ్11 టీమ్‌లో ఎవరిని ఎంచుకోవాలి..? వివరాలు ఇలా..  

Written by - Ashok Krindinti | Last Updated : May 21, 2024, 12:27 PM IST
KKR Vs SRH Dream11 Team: కీలక పోరుకు సన్‌రైజర్స్ సిద్ధం.. కేకేఆర్‌తో బిగ్‌ ఫైట్.. హెడ్ టు హెడ్ రికార్డులు, డ్రీమ్11 టీమ్ టిప్స్ ఇలా

Kolkata Knight Riders vs Sunrisers Hyderabad Playing XI Dream11 Team Tips: అద్భుత ప్రదర్శనతో కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచాయి. కేకేఆర్ 20 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో నిలవగా.. సన్‌రైజర్స్ 17 పాయింట్లతో రెండోస్థానంలో నిలిచింది. ఈ రెండు జట్లు నేడు క్వాలిఫైయర్-1లో తలపడనున్నాయి. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌లోకి అడుగుపెడుతుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. రెండు జట్లు పటిష్టంగా ఉండడంతో ఆసక్తికరపోరు జరిగే అవకాశం ఉంది. రెండు జట్లలో హార్డ్ హిట్టర్లు ఉండడం.. నాణ్యమైన బౌలర్లు ఉండడంతో ఫైట్ ఇంట్రెస్టింగ్‌గా ఉండనుంది. మంగళవారం రాత్రి 7.30 గంటలకు అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మ్యాచ్ ప్రారంభంకానుంది.

Also Read: Astrology - Budh Gochar: శుక్ర రాశిలోకి బుధుడి ఎంట్రీ.. ఈ రాశుల వారికీ జాక్‌పాట్ త‌గిలిన‌ట్టే..

హెడ్ టు హెడ్ రికార్డుల విషయానికి వస్తే.. సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మొత్తం 26 సార్లు తలపడ్డాయి. ఇందులో 17 మ్యాచ్‌ల్లో కేకేఆర్ గెలుపొందగా.. 9 సార్లు ఎస్ఆర్‌హెచ్ విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఈ రెండు జట్లు ఒకసారే తలపడగా.. కోల్‌కతా కేవలం 4 పరుగుల తేడాతో గెలుపొందింది. అహ్మదాబాద్ పిచ్ విషయానికి వస్తే.. ఇక్కడ బ్యాట్స్‌మెన్, బౌలర్లకు సమాన సహకారం లభిస్తుంది. అయితే మొదట బ్యాటింగ్ చేసిన జట్టుకు కాస్త ప్రయోజనం ఉండే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో ఇక్కడ జరిగిన 6 మ్యాచ్‌లలో మూడుసార్లు 200+ దాటి స్కోర్ నమోదైంది. అయితే స్వల్ప స్కోరు గుజరాత్ టైటాన్స్ 89, ఢిల్లీ 92 ఇక్కడే నమోదైంది. కేకేఆర్, ఎస్‌ఆర్‌హెచ్ రెండు జట్ల బ్యాటింగ్ లైనప్ బలంగా ఉండడంతో మరోసారి భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. గూగుల్ విన్ ప్రిడిక్టర్ ప్రకారం.. ఈ మ్యాచ్‌లో గెలవడానికి రెండు జట్లకు దాదాపు సమాన అవకాశాలు ఉన్నాయి. ఎస్‌ఆర్‌హెచ్‌కు కాస్త ఎక్కువ మొగ్గు ఉంది. 51 శాతం సన్‌రైజర్స్ గెలిచే అవకాశం ఉంది. 

తుది జట్లు ఇలా.. (అంచనా) 

సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, అబ్దుల్ సమద్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), సన్వీర్, భువనేశ్వర్, విజయకాంత్, నటరాజన్

కోల్‌కతా నైట్‌రైడర్స్: సునీల్ నరైన్, గుర్బాజ్ అహ్మద్ (వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా, రింకూ సింగ్, ఆండ్రూ రస్సెల్, రమణ్ దీప్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, అనుకుల్.

KKR Vs SRH Dream11 Prediction:

==> వికెట్ కీపర్: హెన్రిచ్ క్లాసెన్
==> బ్యాటర్స్: శ్రేయాస్ అయ్యర్, ట్రావిస్ హెడ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ
==> ఆల్ రౌండర్లు: సునీల్ నరైన్ (వైస్ కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, నితీశ్ కుమార్ రెడ్డి
==> బౌలర్లు: భువనేశ్వర్, మిచెల్ స్టార్క్, వరుణ్‌ చక్రవర్తి, ప్యాట్ కమిన్స్

Read More: Iqoo Neo 9S Pro Price: 5160 mAh బ్యాటరీ, 1TB స్టోరేజ్‌తో ఐక్యూ కొత్త ఫోన్‌ వచ్చేసింది.. ఫీచర్స్‌, ధర వివరాలు ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News