Joe Root Captaincy: కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన జో రూట్‌.. అసలు కారణం అదే!

Joe Root steps down as England Mens Test captain. ఇంగ్లండ్‌ వెటరన్ ప్లేయర్ జో రూట్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్టు కెప్టెన్సీ బాద్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటిం‍చాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 15, 2022, 03:36 PM IST
  • రూట్‌ సంచలన నిర్ణయం
  • కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన జో రూట్‌
  • యాషెస్‌ సిరీస్‌లో ఘోరపరాభవం
Joe Root Captaincy: కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన జో రూట్‌.. అసలు కారణం అదే!

Joe Root Quits England Test Captaincy After Ashes and West Indies defeats: ఇంగ్లండ్‌ వెటరన్ ప్లేయర్ జో రూట్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్టు కెప్టెన్సీ బాద్యతల నుంచి తప్పుకుంటున్నట్లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపాడు. యాషెస్‌ సిరీస్‌లో ఘోరపరాభవం, వెస్టిండీస్‌ పర్యటనలో ఓటమికి బాధ్యత వహిస్తూ.. సుదీర్ఘ ఫార్మాట్‌లో ఇంగ్లీష్ జట్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. టెస్ట్ ఫార్మాట్‌లో రూట్ ఇంగ్లండ్ జట్టుకు ఐదేళ్ల పాటు కెప్టెన్‌గా ఉన్నాడు. 

'కరేబియన్ టూర్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత చాలా ఆలోచించా. చివరకు ఇంగ్లండ్ పురుషుల టెస్ట్ కెప్టెన్సీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నా. నా కెరీర్‌లో అత్యంత సవాలుతో కూడుకున్న నిర్ణయం ఇది. దీని గురించి నా కుటుంబం మరియు అత్యంత సన్నిహితులతో చర్చించాను. ఇదే సరైన సమయం అనిపించింది' అని జో రూట్‌ అన్నాడు. 

'నా దేశానికి కెప్టెన్‌గా వ్యవహరించినందుకు చాలా గర్వపడుతున్నా. గత ఐదేళ్లలో ఎన్నో మధుర స్మృతులు ఉన్నాయి. ఇంగ్లండ్‌ జట్టకు కెప్టెన్‌గా ఉండడాన్ని ఎంతో ఇష్టపడ్డాను. కానీ ఇటీవల కాలంలో అనూహ్య పరిణమాలు చోటు చేసుకున్నాయి. కెప్టెన్సీ ఒత్తిడి నా ఆటపై తీవ్ర ప్రభావం చూపింది. తదుపరి కెప్టెన్‌కు అండగా ఉంటా. నాకు ఇన్నాళ్లు మద్దతుగా నిలిచిన నా కుటుంబ సభ్యులు, అభిమానులు, ఆటగాళ్లు, కోచ్‌లు మరియు సహాయక సిబ్బందికి దన్యవాదాలు. ప్రపంచంలో అత్యుత్తమ అభిమానులను కలిగి ఉన్నందుకు గర్వపడుతున్నా' అని జో రూట్‌ పేర్కొన్నాడు. 

అలిస్టర్ కుక్ రాజీనామా చేసిన తర్వాత 2017లో జో రూట్ ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్నాడు. ఇంగ్లండ్‌ టెస్టు కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రూట్‌ (64 మ్యాచ్‌లు) రికార్డు సృష్టించాడు. తన ఐదేళ్ల కెప్టెన్సీలో ఇంగ్లండ్‌కు 27 విజయాలు అందించి అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన రికార్డును రూట్‌ కలిగి ఉన్నాడు. కెప్టెన్‌గా అత్యధిక టెస్ట్ మ్యాచ్‌లు ఓడిపోయిన ఇంగ్లండ్ కెప్టెన్‌గా కూడా చెత్త రికార్డును రూట్‌ తన పేరిట లిఖించుకున్నాడు. ఈ ఏడాది యాషెస్‌ సిరీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఘోర ఓటమి, వెస్టిండీస్‌ పర్యటనలో ఓటమే అతడు కెప్టెన్సీ వదులుకోవడానికి ప్రధాన కారణం. 

Also Read: Vijay Shankar: ఆ విజయ్ శంకర్‌ ఎందుకురా బాబు.. క్రికెట్ ఆడకుండా నిషేధించండి! త్రీడీ ప్లేయర్ అంటే నవ్వొస్తుంది

Also Read: KGF 2 DAY1 COLLECTIONS: చరిత్ర సృష్టించిన రాఖీ భాయ్.. మొదటి రోజే రూ. 135 కోట్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News